కుమారి రుక్మిణి

కుమారి రుక్మిణి (1929 ఏప్రిల్ 19 - 2007 సెప్టెంబర్ 4)[1], భారతీయ నటి, నర్తకి.[2] ఆమె సుమారు 100కు పైగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది.[3]

కుమారి రుక్మిణి
1940లలో కుమారి రుక్మిణి
జననం
కుమారి రుక్మణి

(1929-04-19)1929 ఏప్రిల్ 19
మరణం2007 సెప్టెంబరు 4(2007-09-04) (వయసు 78)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1935–2000
జీవిత భాగస్వామివై.వి. రావు
పిల్లలులక్ష్మి
తల్లిదండ్రులునుంగంబాక్కం జానకి
బంధువులుఐశ్వర్య భాస్కరన్ (మనవరాలు)

ఆమె హిందీలో లవంగి, మంజరి చిత్రాలను నిర్మించింది.[4]

బాల్యం

మార్చు

ఆమె నటి నుంగంబాక్కం జానకి కుమార్తె. వీరి స్వస్థలం తంజావూరు జిల్లా మేలత్తూరు. బొంబాయిలో తమిళ పౌరాణిక చిత్రం హరిశ్చంద్ర (1932) షూటింగ్ సమయంలో నిర్మాతలు లోహిదాసన్‌గా నటించడానికి యువ నటి కోసం వెతుకుతున్నాడు. కుమారి రుక్మణి చిన్నతనంలో, చిత్రంలో కథానాయికగా నటించిన టి.పి.రాజలక్ష్మి ఉంటున్న పక్క గదిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. టి.పి.రాజలక్ష్మి, కుమారి రుక్మణిని నిర్మాతలకు సిఫార్సు చేసింది. నిర్మాతలు తల్లిదండ్రులతో మాట్లాడి కుమారి రుక్మణిని సినిమాలో నటింపచేసారు. అలా ఆమె బాలనటిగా చలనచిత్ర రంగప్రవేశం జరిగింది.[5]

కెరీర్

మార్చు

ఆమె ఆ తరువాత టి. పి.రాజలక్ష్మితో కలిసి అనేక చిత్రాలలో నటించింది. కథానాయికగా ఆమె మొదటి చిత్రం 1945లో వచ్చిన శ్రీ వల్లి. ఇందులో ఆమె టి.ఆర్.మహాలింగంతో జంటగా నటించింది.[6] 1946లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వై.వి.రావుతో లవంగి చిత్రంలో నటించింది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆమె, వై.వి.రావు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సినీ నటి లక్ష్మి వీరి కుమార్తె.[7]

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారి రుక్మిణి 2007 సెప్టెంబర్ 4న చెన్నైలోని తన కుమార్తె నటి లక్ష్మి నివాసంలో మరణించింది.[8]

మూలాలు

మార్చు
  1. "Birthdays of Film stars". Kundoosi (in Tamil): 34–35. 1951.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  2. Randor Guy (25 May 2013). "Blast from the past - lavangi 1946". The Hindu. Archived from the original on 10 September 2013. Retrieved 19 November 2016. The heroine was Kumari Rukmini, daughter of dancer Nungambakkam Janaki. She entered films as Baby Rukmini and went on to become a star.
  3. "Yesteryear actor Rukmani dies". The Hindu. 5 September 2007. Archived from the original on 19 November 2016. Retrieved 19 November 2016.
  4. "Yesteryear actor Rukmani dies". The Hindu. 5 September 2007. Archived from the original on 19 November 2016. Retrieved 19 November 2016.
  5. "சூப்பர் ஸ்டார்களின் கதாநாயகி!" [Heroine of super stars]. The Hindu (in Tamil). 12 September 2015. Archived from the original on 9 January 2017. Retrieved 19 November 2016.{{cite web}}: CS1 maint: unrecognized language (link) (English translation)
  6. "Yesteryear actor Rukmani dies". The Hindu. 5 September 2007. Archived from the original on 19 November 2016. Retrieved 19 November 2016.
  7. Randor Guy (25 May 2013). "Blast from the past - lavangi 1946". The Hindu. Archived from the original on 10 September 2013. Retrieved 19 November 2016. The heroine was Kumari Rukmini, daughter of dancer Nungambakkam Janaki. She entered films as Baby Rukmini and went on to become a star.
  8. "Yesteryear actor Rukmani dies". The Hindu. 5 September 2007. Archived from the original on 19 November 2016. Retrieved 19 November 2016.