కుమార్ ధర్మసేన

శ్రీలంక క్రికెట్ అంపైర్, మాజీ క్రికెట్ ఆటగాడు

దేశబంధు హందున్నెట్టిగే దీప్తి ప్రియంత కుమార్ ధర్మసేన (జననం 1971, ఏప్రిల్ 24) శ్రీలంక క్రికెట్ అంపైర్, మాజీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.[1] ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌లలో సభ్యుడు, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆటగాడిగా, అంపైర్‌గా పాల్గొన్న మొదటి, ఏకైక వ్యక్తిగా రికార్డు సాధించాడు. 1996 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా రాణించాడు.

కుమార్ ధర్మసేన
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హందున్నెట్టిగే దీప్తి ప్రియంత కుమార్ ధర్మసేన
పుట్టిన తేదీ (1971-04-24) 1971 ఏప్రిల్ 24 (వయసు 53)
కొలంబో, శ్రీలంక
మారుపేరుఉనందువ
ఎత్తు1.72 మీ. (5 అ. 8 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
పాత్రఆల్ రౌండరు, umpire
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 59)1993 సెప్టెంబరు 6 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2004 మార్చి 8 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 82)1994 ఆగస్టు 24 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2004 ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.66
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–2006Bloomfield Cricket and Athletic Club
1992Nondescripts Cricket Club
1994Moratuwa Cricket Club
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు79 (2010–2023)
అంపైరింగు చేసిన వన్‌డేలు118 (2009–2022)
అంపైరింగు చేసిన టి20Is42 (2009–2022)
అంపైరింగు చేసిన మవన్‌డేలు1 (2008)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 31 141 155 206
చేసిన పరుగులు 868 1,222 6,550 2,281
బ్యాటింగు సగటు 19.72 22.62 36.18 26.21
100లు/50లు 0/3 0/4 9/37 0/9
అత్యుత్తమ స్కోరు 62* 69* 157 94*
వేసిన బంతులు 6,939 7,009 25,549 9,747
వికెట్లు 69 138 495 234
బౌలింగు సగటు 42.31 36.21 20.77 28.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0 30 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 5 0
అత్యుత్తమ బౌలింగు 6/72 4/37 7/30 5/14
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 34/– 78/– 50/–
మూలం: Cricinfo, 24 April 2023

రికార్డులు

మార్చు
  • క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆడిన ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అంపైర్‌గా వ్యవహరించిన ఏకైక వ్యక్తి ధర్మసేన. 1996 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడాడు. 2015, 2019 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో రెండుసార్లు ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా కనిపించాడు.[2]

మూలాలు

మార్చు
  1. "International cricketers turned umpires". International Cricket Council. Retrieved 2023-08-31.
  2. "Kumar Dharmasena First to Play and Umpire in World Cup Final | Cricket News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.

బాహ్య లింకులు

మార్చు