1996 క్రికెట్ ప్రపంచ కప్
1996 క్రికెట్ ప్రపంచ కప్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన ఆరవ క్రికెట్ ప్రపంచ కప్. ఇది 1996 ఫిబ్రవరి 14 నుండి మార్చి 17 వరకు భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంకలలో జరిగింది. స్పాన్సర్‌షిప్ కు అనుగుణంగా దీన్ని విల్స్ వరల్డ్ కప్ 1996 అన్నారు.
1996 క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
తేదీలు | 1996 ఫిబ్రవరి 14 – మార్చి 17 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు |
|
ఛాంపియన్లు | శ్రీలంక (1st title) |
పాల్గొన్నవారు | 12 |
ఆడిన మ్యాచ్‌లు | 37 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | సనత్ జయసూర్య |
అత్యధిక పరుగులు | సచిన్ టెండూల్కర్ (523) |
అత్యధిక వికెట్లు | అనిల్ కుంబ్లే (15) |
← 1992 1999 → |
1996 మార్చి 17న పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి కప్పును గెలుచుకుంది.[1]
ఆతిథ్య దేశాలు
మార్చుప్రపంచకప్ భారత్, పాకిస్థాన్, శ్రీలంకలలో జరిగింది. భారత్ 17 వేర్వేరు వేదికల్లో 17 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా, పాకిస్థాన్ 6 వేదికల్లో 16 మ్యాచ్‌లకు, శ్రీలంక 3 వేదికల్లో 4 మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇచ్చాయి.
ఆటలు మొదలవాక్ఆ ముందే టోర్నమెంటులో వివాదం రేగింది. 1996 జనవరిలో తమిళ టైగర్లు కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్‌పై బాంబు దాడి చేసిన తర్వాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లు తమ జట్లను శ్రీలంకకు పంపడానికి నిరాకరించాయి. శ్రీలంక, జట్లకు గరిష్ట భద్రతను అందిస్తామని ప్రకటించడంతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సురక్షితమని నిర్ధారించిన తరువాత కూడా భద్రతా సమస్యలను ఉదహరించడం ఏంటని ప్రశ్నించింది. విస్తృతమైన చర్చల తర్వాత ఐసిసి, ఆ రెండు గేములను శ్రీలంకకు ఇచ్ఛేయాలని తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం ఫలితంగా, శ్రీలంక ఆటలు మొదలు కాకముందే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించేసింది.
భారతదేశం
మార్చువేదిక | నగరం | సామర్థ్యం | మ్యాచ్‌లు |
---|---|---|---|
ఈడెన్ గార్డెన్స్ | కలకత్తా, పశ్చిమ బెంగాల్ | 120,000 | 1 |
గ్రీన్ పార్క్ | కాన్పూర్, ఉత్తరప్రదేశ్ | 45,000 | 1 |
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం | మొహాలి, పంజాబ్ | 40,000 | 1 |
ఎం. చిన్నస్వామి స్టేడియం | బెంగళూరు, కర్ణాటక | 55,000 | 1 |
M. A. చిదంబరం స్టేడియం | మద్రాసు, తమిళనాడు | 50,000 | 1 |
లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం | హైదరాబాద్, తెలంగాణ | 30,000 | 1 |
బారాబతి స్టేడియం | కటక్, ఒడిశా | 25,000 | 1 |
రూప్ సింగ్ స్టేడియం | గ్వాలియర్, మధ్యప్రదేశ్ | 55,000 | 1 |
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ | 25,000 | 1 |
మొయిన్-ఉల్-హక్ స్టేడియం | పాట్నా, బీహార్ | 25,000 | 1 |
నెహ్రూ స్టేడియం | పూణే, మహారాష్ట్ర | 25,000 | 1 |
వాంఖడే స్టేడియం | ముంబై, మహారాష్ట్ర | 45,000 | 1 |
సర్దార్ పటేల్ స్టేడియం | అహ్మదాబాద్, గుజరాత్ | 48,000 | 1 |
మోతీ బాగ్ స్టేడియం | వడోదర, గుజరాత్ | 18,000 | 1 |
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం | జైపూర్, రాజస్థాన్ | 30,000 | 1 |
విదర్భ సి.ఎ. గ్రౌండ్ | నాగ్‌పూర్, మహారాష్ట్ర | 40,000 | 1 |
ఫిరోజ్ షా కోట్లా మైదానం | ఢిల్లీ, న్యూఢిల్లీ | 48,000 | 1 |
పాకిస్తాన్
మార్చువేదికలు | నగరాలు | కెపాసిటీ | మ్యాచ్‌లు |
---|---|---|---|
జాతీయ స్టేడియం | కరాచీ, సింధ్ | 34,000 | 3 |
గడ్డాఫీ స్టేడియం | లాహోర్, పంజాబ్ | 62,000 | 4 |
రావల్పిండి క్రికెట్ స్టేడియం | రావల్పిండి, పంజాబ్ | 25,000 | 3 |
అర్బాబ్ నియాజ్ స్టేడియం | పెషావర్, ఖైబర్ పఖ్తుంక్వా | 20,000 | 2 |
ఇక్బాల్ స్టేడియం | ఫైసలాబాద్, పంజాబ్ | 18,000 | 3 |
జిన్నా స్టేడియం | గుజ్రాన్‌వాలా, పంజాబ్ | 20,000 | 1 |
శ్రీలంక
మార్చువేదికలు | నగరాలు | కెపాసిటీ | మ్యాచ్‌లు |
---|---|---|---|
R. ప్రేమదాస స్టేడియం | కొలంబో | 14,000 | 0* |
సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ | కొలంబో | 10,000 | 1 |
అస్గిరియ స్టేడియం | కాండీ | 10,300 | 1 |
- ప్రేమదాస స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది, అయితే శ్రీలంకలో ఆడేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు నిరాకరించడంతో రెండూ జరగలేదు. [2]
జట్లు
మార్చుగత ప్రపంచ కప్ తర్వాత ICCలో తొమ్మిదవ టెస్ట్ స్థాయి సభ్యులుగా మారిన జింబాబ్వేతో సహా అన్ని టెస్ట్ ఆడే దేశాలు పోటీలో పాల్గొన్నాయి. 1994 ICC ట్రోఫీ ద్వారా అర్హత సాధించిన మూడు అసోసియేట్ జట్లు (గతంలో ఒకటి) - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, నెదర్లాండ్స్ - కూడా 1996లో తమ తొలి ప్రపంచ కప్ ఆడాయి. పూణెలో వెస్టిండీస్‌పై కెన్యా అనూహ్య విజయాన్ని నమోదు చేయగా, నెదర్లాండ్స్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది, ఇందులో UAE చేతిలో ఓటమి కూడా ఉంది.
పూర్తి స్థాయి సభ్యులు | ||
---|---|---|
ఆస్ట్రేలియా | ఇంగ్లాండు | భారతదేశం |
న్యూజీలాండ్ | పాకిస్తాన్ | దక్షిణాఫ్రికా |
శ్రీలంక | వెస్ట్ ఇండీస్ | జింబాబ్వే |
అసోసియేట్ సభ్యులు | ||
కెన్యా | నెదర్లాండ్స్ | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
సారాంశం
మార్చుశ్రీలంక ప్రతి ఇన్నింగ్స్‌లోనూ మొదటి 15 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను సద్వినియోగం చేసుకోవడానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సనత్ జయసూర్యను [3] రమేష్ కలువితరణలను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దించారు. మొదటి 15 ఓవర్లలో 50 లేదా 60 పరుగులు చేస్తే గొప్ప అని భావిస్తున్న సమయంలో శ్రీలంక, అదే 15 ఓవర్లలో భారత్‌పై 117, కెన్యాపై 123, క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 121, సెమీ-ఫైనల్‌లో భారత్‌పై 86 పరుగులు చేసింది. కెన్యాపై, శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది, ఇది 2006 ఏప్రిల్ వరకు ఉన్న వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక జట్టు స్కోర్‌గా కొత్త రికార్డు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్యారీ కిర్‌స్టన్ 188 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్, ఆ తరువాత మార్టిన్ గప్టిల్‌లు 215, 237 పరుగులు చేసి దానిని అధిగమించే వరకు ఇది ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.
కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అనధికారికంగా 1,10,000 మంది ప్రేక్షకుల ముందు జరిగిన మొదటి సెమీ-ఫైనల్‌లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించింది. ఓపెనర్లిద్దరినీ త్వరగా కోల్పోయిన తర్వాత, శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 251 పరుగుల బలమైన స్కోరు చేసింది. ఆ తరువాత అరవింద డి సిల్వా నేతృత్వంలో ఎదురుదాడి ప్రారంభించింది. భారత్ తమ ఛేజింగ్‌ను ఆశాజనకంగానే ప్రారంభించింది, అయితే సచిన్ టెండూల్కర్ ఓడిపోవడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 35వ ఓవర్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 120 పరుగులకు కుప్పకూలిన తర్వాత, ప్రేక్షకులలో కొందరు మైదానంలోకి పండ్లు, ప్లాస్టిక్ బాటిళ్ళూ విసరడం ప్రారంభించారు. ప్రేక్షకులను శాంతింపజేసే ప్రయత్నంలో ఆటగాళ్లు 20 నిమిషాల పాటు మైదానం విడిచిపెట్టారు. ఆటగాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, మరిన్ని సీసాలు మైదానంలోకి విసిరారు. స్టాండ్‌లో మంటలు వ్యాపించాయి. [4] [5] మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ శ్రీలంకకు మ్యాచ్‌ను ఇచ్చేసాడు.
మొహాలీలో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా 15/4 నుంచి కోలుకుని 50 ఓవర్లలో 207/8కి చేరుకుంది. వెస్టిండీస్, 42వ ఓవర్లో 165/2 స్కోరుతో బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, తరువాతి 50 బంతుల్లో 37 పరుగులకే తమ చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోయింది.
శ్రీలంక ఫైనల్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు పంపింది. గత ఐదు ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనూ ముందు బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఈసారి శ్రీలంక ఆ సంప్రదాయాన్ని త్రోసిరాజని 47వ ఓవర్‌లో మ్యాచ్ గెలిచి, కప్ చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా స్కోరు 241/7లో మార్క్ టేలర్ 74 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. అరవింద డి సిల్వా అజేయంగా 107 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు.[6]
గ్రూప్ దశ
మార్చుపోస్ | జట్టు | Pld | W | ఎల్ | టి | NR | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | శ్రీలంక | 5 | 5 | 0 | 0 | 0 | 10 | 1.607 |
2 | ఆస్ట్రేలియా | 5 | 3 | 2 | 0 | 0 | 6 | 0.903 |
3 | భారతదేశం | 5 | 3 | 2 | 0 | 0 | 6 | 0.452 |
4 | వెస్ట్ ఇండీస్ | 5 | 2 | 3 | 0 | 0 | 4 | -0.134 |
5 | జింబాబ్వే | 5 | 1 | 4 | 0 | 0 | 2 | -0.939 |
6 | కెన్యా | 5 | 1 | 4 | 0 | 0 | 2 | −1.007 |
1996 ఫిబ్రవరి 17
స్కోరు |
v
|
||
- ఆస్ట్రేలియా forfeited the match due to safety concerns, and were in Mumbai at the time of the match.
1996 ఫిబ్రవరి 27
స్కోరు |
v
|
||
- This game was scheduled to be played on 25 February; the game started but was abandoned after 15.5 overs of the Zimbabwe innings.
1996 ఫిబ్రవరి 29
స్కోరు |
v
|
||
- కెన్యా తమ తొలి వన్‌డే మ్యాచ్ గెలుచుకుంది.
- This was the first time the West Indies lost an ODI to an ICC Associate.
- This was the fourth win in ODI history by an ICC Associate (all in World Cups, SL v IND 1979, ZIM v AUS 1983, ZIM v ENG 1992).
6 March
స్కోరు |
v
|
||
- శ్రీలంక's total of 398/5 surpassed England's 363/7 against Pakistan in 1992 as the highest score in all ODIs. The record stood until 12 March 2006, when both Australia and South Africa broke it in the same match. It remained a World Cup record until the 2007 tournament, when India scored 413/5 against Bermuda.[7]
గ్రూప్ బి
మార్చుపోస్ | జట్టు | Pld | W | ఎల్ | టి | NR | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | దక్షిణ ఆఫ్రికా | 5 | 5 | 0 | 0 | 0 | 10 | 2.043 |
2 | పాకిస్తాన్ | 5 | 4 | 1 | 0 | 0 | 8 | 0.961 |
3 | న్యూజిలాండ్ | 5 | 3 | 2 | 0 | 0 | 6 | 0.552 |
4 | ఇంగ్లండ్ | 5 | 2 | 3 | 0 | 0 | 4 | 0.079 |
5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 5 | 1 | 4 | 0 | 0 | 2 | -1.830 |
6 | నెదర్లాండ్స్ | 5 | 0 | 5 | 0 | 0 | 0 | -1.923 |
1996 ఫిబ్రవరి 16
స్కోరు |
v
|
||
- Match was delayed from 15th February due to rain and a flooded ground.
- Gary Kirsten's unbeaten 188 was the highest ever individual score in a World Cup match, surpassing Viv Richards' 181* against Sri Lanka in 1987, and the second-highest ODI score of all time, one short of Richards' all-time ODI record score of 189.
- South Africa's score of 321/2 was their highest in ODIs.
- The United Arab Emirates' ninth-wicket partnership of 80* between Arshad Laeeq, Shaukat Dukanwala was the second-highest of all time.
1996 ఫిబ్రవరి 17
స్కోరు |
v
|
||
- This was the Netherlands' first ODI match.
- Peter Cantrell, Flavian Aponso, Steven Lubbers, Roland Lefebvre, Tim de Leede, Klaas-Jan van Noortwijk, Marcelis Schewe, Bastiaan Zuiderent, Eric Gouka, Paul-Jan Bakker (Ned) all made their ODI debut.
- At 47 years and 240 days, Nolan Clarke (Ned) became the oldest player to make his ODI debut.[8][9]
- Stephen Fleming (NZ) took his only ODI wicket.[10]
1996 ఫిబ్రవరి 27
స్కోరు |
v
|
||
- Match reduced to 47 overs a side due to heavy fog at the start of the match.
1996 ఫిబ్రవరి 29
స్కోరు |
v
|
||
- Bucknor replaced Ian Robinson as an umpire in this match after protests by Pakistan.
5 March 1996
స్కోరు |
v
|
||
- దక్షిణాఫ్రికా won the toss and elected to bat.
- Peter Cantrell, Flavian Aponso, Marcelis Schewe, Eric Gouka, Steven Lubbers, Paul-Jan Bakker (all Ned) played their final ODI match.[11]
- Nolan Clarke (Ned), aged 47 years and 257 days, played his final ODI match, the oldest player to do so.[12][13]
నాకౌట్ దశ
మార్చుQuarter-finals | Semi-finals | Final | ||||||||
మార్చి 9 – ఫైసలాబాద్, పాకిస్తాన్ | ||||||||||
ఇంగ్లాండు | 235/8 | |||||||||
మార్చి 13 – కోల్‌కతా, ఇండియా | ||||||||||
శ్రీలంక | 236/5 | |||||||||
శ్రీలంక | 251/8 | |||||||||
9 March – బెంగళూరు, ఇండియా | ||||||||||
భారతదేశం | 120/8 | |||||||||
భారతదేశం | 287/8 | |||||||||
మార్చి 17 – లాహోర్, పాకిస్తాన్ | ||||||||||
పాకిస్తాన్ | 248/9 | |||||||||
శ్రీలంక | 245/3 | |||||||||
మార్చి 11 – కరాచి, పాకిస్తాన్ | ||||||||||
ఆస్ట్రేలియా | 241/7 | |||||||||
వెస్ట్ ఇండీస్ | 264/8 | |||||||||
మార్చి 14 – మొహాలీ, ఇండియా | ||||||||||
దక్షిణాఫ్రికా | 245 | |||||||||
వెస్ట్ ఇండీస్ | 202 | |||||||||
మార్చి 11 – చెన్నై, ఇండియా | ||||||||||
ఆస్ట్రేలియా | 207/8 | |||||||||
న్యూజీలాండ్ | 286/9 | |||||||||
ఆస్ట్రేలియా | 289/4 | |||||||||
సెమీ ఫైనల్స్
మార్చు 9 March
స్కోరు |
v
|
||
- ఇండియా won the toss and elected to bat first.
- పాకిస్తాన్ was fined 1 over for a slow over rate.
సెమీ ఫైనల్స్
మార్చు 13 March
స్కోరు |
v
|
||
- ఇండియా won the toss and elected to field.
- The match was awarded to Sri Lanka by match referee Clive Lloyd when play could not be continued due to the rioting crowd.[4][5]
ఫైనల్
మార్చుv
|
||
- శ్రీలంక won the toss and elected to field.
శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మార్క్ టేలర్ (83 బంతుల్లో 74, 8 ఫోర్లు, 1 సిక్స్), రికీ పాంటింగ్ (73 బంతుల్లో 45, 2 ఫోర్లు) లు రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే, పాంటింగ్, టేలర్ ఔటయ్యాక, శ్రీలంక స్పిన్ దాడి కారణంగా ఆస్ట్రేలియా 137/1 నుండి 170/5కి పడిపోయింది. పతనమైనప్పటికీ, ఆస్ట్రేలియా వారి 50 ఓవర్లలో 241/7తో సాధించింది.
గణాంకాలు
మార్చుపరుగులు | ఆటగాడు | దేశం |
---|---|---|
523 | సచిన్ టెండూల్కర్ | భారతదేశం |
484 | మార్క్ వా | ఆస్ట్రేలియా |
448 | అరవింద డి సిల్వా | శ్రీలంక |
391 | గ్యారీ కిర్స్టన్ | దక్షిణాఫ్రికా |
329 | సయీద్ అన్వర్ | పాకిస్తాన్ |
వికెట్లు | ఆటగాడు | దేశం |
---|---|---|
15 | అనిల్ కుంబ్లే | భారతదేశం |
13 | వకార్ యూనిస్ | పాకిస్తాన్ |
12 | పాల్ స్ట్రాంగ్ | జింబాబ్వే |
రోజర్ హార్పర్ | వెస్ట్ ఇండీస్ | |
డామియన్ ఫ్లెమింగ్ | ఆస్ట్రేలియా | |
షేన్ వార్న్ | ఆస్ట్రేలియా |
శతకాల జాబితా
మార్చుపేరు | స్కోరు | బంతులు | 4లు | 6లు | S/R | జట్టు | ప్రత్యర్థి | వేదిక | తేదీ | ODI # |
---|---|---|---|---|---|---|---|---|---|---|
NJ ఆస్టిల్ | 101 | 132 | 8 | 2 | 76.51 | న్యూజీలాండ్ | ఇంగ్లాండు | అహ్మదాబాదు | 14 ఫిబ్రవరి 1996 | 1048 |
జి కిర్‌స్టన్ | 188* | 159 | 13 | 4 | 118.23 | దక్షిణాఫ్రికా | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | రావల్పిండి | 16 ఫిబ్రవరి 1996 | 1049 |
SR టెండూల్కర్ | 127* | 138 | 15 | 2 | 92.02 | భారతదేశం | కెన్యా | బారాబతి స్టేడియం, కటక్ | 18 ఫిబ్రవరి 1996 | 1052 |
GA హిక్ | 104* | 133 | 6 | 2 | 78.19 | ఇంగ్లాండు | నెదర్లాండ్స్ | పెషావర్ | 22 ఫిబ్రవరి 1996 | 1057 |
ME వా | 130 | 128 | 14 | 1 | 101.56 | ఆస్ట్రేలియా | కెన్యా | విశాఖపట్నం | 23 ఫిబ్రవరి 1996 | 1058 |
ME వా | 126 | 135 | 8 | 3 | 93.33 | ఆస్ట్రేలియా | భారతదేశం | వాంఖడే స్టేడియం, ముంబై | 27 ఫిబ్రవరి 1996 | 1065 |
అమీర్ సోహైల్ | 111 | 139 | 8 | 0 | 79.85 | పాకిస్తాన్ | దక్షిణాఫ్రికా | నేషనల్ స్టేడియం, కరాచీ | 29 ఫిబ్రవరి 1996 | 1067 |
SR టెండూల్కర్ | 137 | 137 | 8 | 5 | 100.00 | భారతదేశం | శ్రీలంక | ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, ఢిల్లీ | 2 మార్చి 1996 | 1070 |
RT పాంటింగ్ | 102 | 112 | 5 | 1 | 91.07 | ఆస్ట్రేలియా | వెస్ట్ ఇండీస్ | జైపూర్ | 4 మార్చి 1996 | 1072 |
AC హడ్సన్ | 161 | 132 | 13 | 4 | 121.96 | దక్షిణాఫ్రికా | నెదర్లాండ్స్ | రావల్పిండి | 5 మార్చి 1996 | 1073 |
PA డి సిల్వా | 145 | 115 | 14 | 5 | 126.08 | శ్రీలంక | కెన్యా | కాండీ | 6 మార్చి 1996 | 1074 |
VG కాంబ్లీ | 106 | 110 | 11 | 0 | 96.36 | భారతదేశం | జింబాబ్వే | గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ | 6 మార్చి 1996 | 1075 |
BC లారా | 111 | 94 | 16 | 0 | 118.08 | వెస్ట్ ఇండీస్ | దక్షిణాఫ్రికా | నేషనల్ స్టేడియం, కరాచీ | 11 మార్చి 1996 | 1079 |
CZ హారిస్ | 130 | 124 | 13 | 4 | 104.83 | న్యూజీలాండ్ | ఆస్ట్రేలియా | మద్రాసు | 11 మార్చి 1996 | 1080 |
ME వా | 110 | 112 | 6 | 2 | 98.21 | ఆస్ట్రేలియా | న్యూజీలాండ్ | మద్రాసు | 11 మార్చి 1996 | 1080 |
PA డి సిల్వా | 107* | 124 | 13 | 0 | 86.29 | శ్రీలంక | ఆస్ట్రేలియా | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | 17 మార్చి 1996 | 1083 |
మూలాలు
మార్చు- ↑ "Full Scorecard of Australia vs Sri Lanka Final 1995/96 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 10 March 2022.
- ↑ "The Lankan lions roar – 1996". ESPNcricinfo. Retrieved 2022-03-10.
- ↑ "Wills World Cup, 1995/96, Final". Cricinfo. Archived from the original on 6 February 2007. Retrieved 29 April 2007.
- ↑ 4.0 4.1 Sabanayakan, S. (13 March 2019). "India vs Sri Lanka, Wills World Cup 1996 semifinal: A real shame". sportstar.thehindu.com.
- ↑ 5.0 5.1 "On This Day: India vs Sri Lanka 1996 World Cup - An Epic Collapse, Tearful Vinod Kambli". news18.com.
- ↑ "World Cup Cricket Team Records & Stats | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-03-10.
- ↑ "Records / One-Day Internationals / Team records / Highest innings totals". ESPNcricinfo. Archived from the original on 1 March 2015. Retrieved 3 March 2015.
- ↑ Chhabria, Vinay (12 March 2020). "10 Guinness World Records held by cricket". CricTracker. Archived from the original on 24 June 2020. Retrieved 24 June 2020.
- ↑ "ODI records – Oldest players on debut". ESPNcricinfo. Archived from the original on 19 December 2019. Retrieved 24 June 2020.
- ↑ "Stephen Fleming's profile". ESPNcricinfo. Archived from the original on 12 May 2020. Retrieved 24 June 2020.
- ↑ "Netherlands v South Africa – Wills World Cup 1995/96 (Group B)". Cricket Archive. Archived from the original on 6 January 2016. Retrieved 24 June 2020.
- ↑ Williamson, Martin; McGlashan, Andrew (3 July 2008). "Help the aged". ESPNcricinfo. Archived from the original on 21 May 2020. Retrieved 24 June 2020.
- ↑ "ODI records – Oldest players". ESPNcricinfo. Archived from the original on 19 December 2019. Retrieved 24 June 2020.
- ↑ "Wills World Cup, 1995/96 batting most runs career Records". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.
- ↑ "Wills World Cup, 1995/96 bowling most wickets career Records". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.