కురుముద్దాలి పిచ్చమ్మ

కురుముద్దాలి పిచ్చమ్మ ఆధ్యాత్మిక యోగిని, అవధూత.

జివిత విశేషాలు

మార్చు

అవధూత పిచ్చమ్మ ఆంధ్ర ప్రదేశ్కు చెందిన గుడివాడ తాలూకా లోని కురుమద్దాలి గ్రామంలో పుణ్య దంపతులైన వడ్డె ముత్తాయి, వీరమ్మలకు 1870 లో జన్మించింది. బాల్యంలో ఆమె కట్టెలా బిగుసుకుపోవడం మాట్లాడలేకపోవడం జరిగింది. తల్లిదండ్రులు అనేక వైద్యములు చేయించినా ఫలితం లేకపోయింది. ఆమె తన తల్లికి తనకు ఏవో వేణునాదాలు వినబడుతున్నట్లుందని, అవి వినినంతనే మైమరచి పోయినట్లున్నదని చెప్పేది. ఆమెకు తుమ్మలపల్లి గ్రామంలో నీలంవారి అబ్బాయికిచ్చి వివాహం జరిపించారు. కాపురానికి వెళ్ళీనా ఈ లక్షణాలు కనబడుతుండటంతో అత్తమామలు పరిహాసం చేసేవాళ్ళూ. పిచ్చమ్మకు ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకు "భాగ్యమ్మ" అని నామకరణం చేశారు. అనతి కాలంలోనే ఆమె భర్త స్వర్గస్తుడయ్యాడు. ఆమె కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచింది. కష్టపడి పొలంలో పనిచేసేది. తన కుమార్తెకు సోదరుని కుమారుని కిచ్చి వివాహం చేసింది.కానీ అనతికాలంలోణే అల్లుడు కూడా కాలం చేశాడు. పిచ్చమ్మ పురర్వివాహ వ్యతిరేకి అయినప్పటికీ పిచ్చమ్మ సోదరి పట్టుబడ్డి కుమార్తెకు పునర్వివాహం జరిపించింది. అల్లుడు భాగ్యాన్ని చిత్రహింసలు పెట్టేవాడు. ఈ బాధలు పడలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ శోకంతో పిచ్చమ్మ నిరంతరం ఏడుస్తూ ఉండేది.

అధ్యాత్మిక జ్ఞానం

మార్చు

ఒకసారి కురుముద్దాలికి ఒక గోసాయి వచ్చాడు. పిచ్చమ్మ శోకం తెలుసుకొని ఆయన గుడిసెలోకి వెళ్ళి ఆమెతో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రబోధించాడు. తదుపరి ఆమె భగవంతుని కోసం అంకితమైనది. గృహాన్ని విడిచి తన నివాస స్థానాన్ని రుద్రభూమికి మార్చింది. ఆహారం తినేది కాదు. ఎవరైనా తెస్తే తినేది లేకపోతే స్మశానంలో బూడిద లేదా ఆకులలములతోనో ఆకలి తీర్చుకొనేది. ఆమె ఏమి చెబితే అది అయ్యేది. 1925 లో ఆమెకు ఒక ఆశ్రమం నిర్మించారు. ఆమె రోజు విడిచి రోజు సమాధిలోకి వెళ్ళేది. ఆమె ధనం ముట్టుకోదు. అమ్మ ఐశ్వర్యాన్ని "రోత" అనిపిలిచేది. పొర పాటున వెండి బంగారాన్ని ముట్టుకుంటే వళ్ళంతా కాల్చినట్టుందని అల్లాడిపోయేది. మామూలుగా అమ్మ నగ్నంగా అర్ధ నగ్నంగా వుండేది. కామసంకల్పము కలవారు వస్తున్నట్లయితే "వాడి కంట్లో దోషముందిగానీ నాకున దుప్పటికప్పండిరా అనేది. ఒకసారి సనాతన విప్రులొకరు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మాల కులమునకు చెందినదనే దృష్టితో దూరంగా వుండి మాట్లాడుతున్నాడు. అమ్మ వేదాంత మూలతత్వాన్ని ఇలా వివరించింది. " వడికిన పోగులు మెడలో వేసుకుని గొప్ప కులమని భ్రమ పడుతున్నావు . వడకని పోగులు నీలో ఉన్నాయి. వెతికి చూసుకో దొరుకుతాయి " అని జ్ఞాన బోధ చేసినది.ఇలా ఆధ్యాత్మిక మార్గమెంత కష్టమైనదో సాధకులకు తెలిపేది. అమ్మ పడుకుంటే ఆమె మీదుగా పాములు పాకి వెళ్ళి పోతుండేవి. అను కోకుండా అమ్మ భారత దేశ యాత్ర చేసింది. "యాత్రలకని వెళ్ళాంగానీ ,క్షేత్రాలలో దేవునికంటే ,నాలోని దేవుడే కమ్మగా వున్నాడు" అన్నది అమ్మ

కైవల్యము

మార్చు

అమ్మ 1951 janavari15న సిద్ధి పొందారు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు