కురుమద్దాలి

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

కురుమద్దాలి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన పామర్రు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 920 ఇళ్లతో, 3197 జనాభాతో 884 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1581, ఆడవారి సంఖ్య 1616. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 761 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 58. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589572[1].పిన్ కోడ్: 521157.సముద్రమట్టానికి 9 మీ.ఎత్తులో ఉంది.ఇది ఉయ్యూరు-పామర్రు ల మధ్యలో పామర్రుకు 3 కిలోమీటర్ల దూరాన ఉంది.

కురుమద్దాలి
—  రెవిన్యూ గ్రామం  —
కురుమద్దాలి is located in Andhra Pradesh
కురుమద్దాలి
కురుమద్దాలి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°20′10″N 80°55′45″E / 16.336231°N 80.929068°E / 16.336231; 80.929068
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కొసరాజు స్వప్న
జనాభా (2011)
 - మొత్తం 3,197
 - పురుషులు 1,581
 - స్త్రీలు 1,616
 - గృహాల సంఖ్య 920
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

'కురు' అంటే చిన్న అని అర్థం. పుల్లేరు దాటితే పెదమద్దాలి ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపత్నం, విజయవాడ.కూచిపూడి,వుయ్యూరు

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, పెదపారుపూడి, పామర్రు, తోట్లవల్లూరు.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు పామర్రులో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పామర్రులోను, ఇంజనీరింగ్ కళాశాల గుడ్లవల్లేరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్‌ పామర్రులోను, మేనేజిమెంటు కళాశాల గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పామర్రులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

 • ఆర్.సి.ఎం.పాఠశాల.
 • ఎస్.వి.ఎస్. ఆంగ్లమాధ్యమ పాఠశాల.
 • మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-19న మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎం.రామమోహనరావు అధ్యక్షతన నిర్వహించెదరు. [12]
 • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

కురుమద్దాలిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంసవరించు

ఈ కేంద్రానిక్ నూతన భవన నిర్మాణానికి కీ.శే.కొసరాజు శ్రీరాములు ఙాపకార్ధం, అతని భార్య కుసుమకుమారి, కుమారులు మల్లిఖార్జునరావు, విజయబసవారావు, కుమార్తెలు ఉమాదేవి, రమాదేవి, ఆరు లక్షల రూపాయలను వితరణగా అందజేసినారు. ఈ భవనాన్ని 2015, డిసెంబరు-27వ తేదీనాడు ప్రారంభించారు. [9]&[11]

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరుఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యంసవరించు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

కురుమద్దాలిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

కురుమద్దాలిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 157 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 727 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 8 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 719 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

కురుమద్దాలిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 638 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 81 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

కురుమద్దాలిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి, మినుము, చెరకు

పారిశ్రామిక ఉత్పత్తులుసవరించు

ఇటుకలు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామంలో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [6]

గ్రామ పంచాయతీసవరించు

 1. మండలంలోని మేజరు పంచాయతీలలో ఇది ఒకటి.
 2. మొదటి సర్పంచ్ కొసరాజు శ్రీరంగనాయకులు (1938-52)
 3. ప్రత్తిపాటి రమాదేవి సర్పంచిగా (2006 నుండి-2013).
 4. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొసరాజు స్వప్న, సర్పంచిగా ఎన్నికైనాడు. తరువాత వీరు పామర్రు మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [2]&[4]
 5. పంచాయతీ నిధులతో పాటు, గ్రామ ప్రముఖుల వితరణతో గ్రామంలో ఇంతవరకు ఒకటిన్నర కోట్ల రూపాయల వైలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టారు. [10]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

 1. శ్రీ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ చెన్నమల్లీశ్వరస్వామి ఆలయం (శివాలయం).
 2. శ్రీ భూనీలా సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం (విష్ణు ఆలయం) రెండున్నర్ర శతాబ్దాల క్రితం నిర్మించారు.
 3. శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం 1937లో కట్టినారు. షిర్డీలో సాయిబాబా దేవాలయం తరువాత దేశంలో కట్టిన రెండవ దేవాలయం ఇది.[ఆధారం చూపాలి]
 4. శ్రీ ఆంజనేయస్వామి ఆలయం 2003 ఏప్రిల్లో కట్టినారు.
 5. శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం:- గ్రామంలోని ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్థి చెందింది. రచయిత గుడిపాటి వెంకటాచలం పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

 1. కురుమద్దాలి గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పరిశ్రమలు కూడా బాగా స్థాపిస్తున్నారు. ఈ ఊరిలో చదువుకున్నవారు చాలా ఎక్కువ. అనేక మంది పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు.
 2. కురుమద్దాలి గ్రామానికి చెందిన శ్రీమతి నూతక్కి జయప్రద, మాజీ ఎం.పిటి.సి., మరియూ ఒక మహిళా రైతు. వీరు 2013-14 సంవత్సరంలో, తన 3.3 ఎకరాల పొలంలో, ఎకరానికి 72 టన్నుల చెరకు పండించారు. ఉయ్యూరులోని కె.సి.పి.పంచదార కర్మాగారం పరిధిలో ఇది అత్యధిక పంట. ఈ సందర్భంగా వీరికి 2014,జూన్-12, గురువారం నాడు, ఉయ్యూరు కె.సి.పి. కర్మాగారంవారు ఒక బంగారు పతకం అందజేసినారు. [1]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

స్వాతంత్రోద్యమ ప్రముఖులుసవరించు

 • గుళ్ళపల్లి రామబ్రహ్మం
 • గుళ్ళపల్లి శ్రీరాములు
 • గుళ్ళపల్లి తాతయ్య (బాపయ్య)
 • వీరమాచనేని మల్లిఖార్జునరావు
 • ముత్తేవి కేశవాచార్యులు
 • పుట్టగుంట సుబ్బారావు
 • ముత్తేవి మాధవాచార్య

కొసరాజు వీరయ్య చౌదరిసవరించు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వీరు 2014, ఆగస్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. [3] & [5]. వీరు కేంద్రప్రభుత్వ విజిలెన్స్ కమిషనరుగా నియమితులైనారు. వీరు 10,జూన్-2015న ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. [8]

కొసరాజు వెంకట పూర్ణచంద్రరావుసవరించు

ప్రముఖ న్యాయవాది .వీరు 1922,జులై-3వ తేదీనాడు, ఈ గ్రామంలోని వెంకటగిరయ్య, సత్యవతి దంపతులకు, జన్మించారు. వీరు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.య్యే. పట్టాను, మదరాసు లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాను పొందినారు. 1947లో మచిలీపట్నంలో న్యయవాదిగా ప్రాక్టీసు చేసారు. దీర్ఘకాలంపాటు ఎండోమెంట్సు స్టాండింగ్ కౌన్సిలుగా వ్యవహరించారు. చల్లపల్లి ఎస్టేటుకు రిసీవరుగా పనిచేసారు. ల్యాండ్ ఎక్విజిషను కేసులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు ఉంది. వీరికి భార్య శేషమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీ సురేంద్రనాథ్, అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడినారు. రెండవ కుమారుడు శ్రీ కె.వి.చౌదరి, సి.బి.డి.టి.కి ఛైర్మనుగా పనిచేసారు. ప్రస్తుతం నల్లధనం వెలికితీత ప్రత్యేక బృందం సభ్యులుగా ఉన్నారు. శ్రీ కె.వి.చౌదరి కుమారుడు వెంకటగిరీష్, తాతాగారైన వెంకటపూర్ణచంద్రరావుగారిని ఆదర్శంగా తీసుకొని, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పూర్ణచంద్రరావుగారు భారతీయ సంప్రదాయాలంటే అమిత అభిమానం చూపేవారు. ప్రతి రోజూ భగవద్గీత, రామాయణం, మహాభారతం చదివేవారు. వీరికి వ్యవసాయమంటే మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ మచిలీపట్టణం నుండి స్వగ్రామమైన కురుమద్దాలి వెళ్ళి వ్యవసాయ పనులను పర్యవేక్షణ చేసేవారు.వ్యవసాయం అంటే 365 రోజులూ చెయాలని అనేవారు. వీరి భార్య శ్రీమతి శేషమ్మ, దివంగత మాజీ కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్మనుగా పనిచేసిన శ్రీ పిన్నమనెని కోటేశ్వరరావుగారి స్వంత సహోదరి. వీరు, 2015,మార్చి-23వ తేదీనాడు, 92 సంవత్సరాల వయసులో, ఢిల్లీలో అనారోగ్యంతో కాలంచెసినారు. [7]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3694. ఇందులో పురుషుల సంఖ్య 1772, స్త్రీల సంఖ్య 1922, గ్రామంలో నివాసగృహాలు 956 ఉన్నాయి.

మూలాలుసవరించు

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014,జూన్-13; 11వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జులై-29; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా, 2014,జులై-31; 7వపేజీ. [5] ఈనాడు మెయిన్, 2014,ఆగస్టు-2; 11వపేజీ. [6] ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,మార్చి-25; 7వపేజీ. [8] ఈనాడు మెయిన్, 2015,జూన్-11; 11వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-30; 24వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 24వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-28; 23వపేజీ. [12] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-18; 1వపేజీ.