కులుమనాలి 2012లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. విమలా రామన్, అర్చన, గౌరీశర్మ, సమీక్ష, కృష్ణుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 9న విడుదలైంది.[1]

కులుమనాలి
దర్శకత్వంసతీష్ వేగేశ్న
స్క్రీన్ ప్లేసతీష్ వేగేశ్న
నిర్మాతబొప్పన చంద్రశేఖర్‌
తారాగణంవిమలా రామన్, అర్చన, గౌరీశర్మ, సమీక్ష, కృష్ణుడు
ఛాయాగ్రహణంజి. శివ కుమార్
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంశ్రీ వసంత్
నిర్మాణ
సంస్థ
జాహ్నవి ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
2012 మార్చి 9
దేశం భారతదేశం
భాషతెలుగు

కృష్ణ (కృష్ణుడు) రుషి(శశాంక్‌) అక్షయ్‌ (అక్షయ్‌) అను (ప్రియ) వీరంతా మంచి స్నేహితులు. విహారయాత్ర కోసం హైదరాబాద్‌ నుంచి కులుమనాలి వెళ్తారు. ఈ క్రమంలో బృందంలోని వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మిస్టీరియస్ మాస్క్ వేసుకున్న ఒక కిల్లర్ వీరందిరీనీ చంపుతున్నారు. అస్సలు ఆ కిల్లర్ ఎవరు వారందరినీ ఎందుకు చంపుతున్నారు? ఈ రహస్యం ఛేదించడానికి ఇన్సెపెక్టర్ ప్రవళిక (విమలారామన్‌) రంగంలోకి దిగుతుంది. ఆమెకు లోకల్ గైడ్ హర్ష(హర్షవర్దన్) సహకరిస్తూంటాడు. ప్రవళిక హంతకులెవరో ఆమె కనుక్కొందా? లేదా? అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. The Times of India (3 March 2012). "Kullu Manali Movie". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  2. The Times of India (2012). "Kullu Manali Movie Review {2/5}: Critic Review of Kullu Manali". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.