విమలా రామన్

భారతీయ సినిమా నటి, మోడల్.

విమలా రామన్ భారతీయ సినిమా నటి, మోడల్. 2009లో ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2]

విమలా రామన్
2013లో ముంబైలో జరిగిన ముంబై మిర్రర్ సినిమా పత్రికా సమావేశంలో విమలా రామన్
జననం
విమలా రామన్

జనవరి 23, 1982
సిడ్ని, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
జాతీయతఆస్ట్రేలియన్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
తల్లిదండ్రులుపట్టాభి రామన్
శాంతా రామన్

జీవిత విషయాలు

మార్చు

బెంగళూరు తమిళ కుటుంబానికి చెందిన విమలా రామన్ 1982, జనవరి 23న పట్టాభి రామన్, శాంతా రామన్ దంపతులకు ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్ని పుట్టి పెరిగింది. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన విమలా రామన్ భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది. 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా,[3] 2005లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ - బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్స్ గెలుచుకుంది.

సినిమారంగం

మార్చు

2005లో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన పోయి అనే తమిళ చిత్రంలో తొలిసారిగా నటించింది.[4] మొట్టమొదటి మలయాళ చిత్రం టైమ్ సినిమాలో సురేష్ గోపితో కలిసి నటించింది. 2007లో అజ్మల్ అమీర్‌తో కలిసి ప్రణయకాలం సినిమాలో, జయరామ్‌తో కలిసి సూర్యన్‌ సినిమాలో నటించింది. 2009లో ఎవరైనా ఎప్పుడైనా తెలుగు సినిమాలో నటించింది. తరువాత గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేంకటేశాయ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2006 పోయి శిల్ప తమిళం
2007 టైం వైగా మీనన్ మలయాళం
2007 ప్రణయకాలం మరియా మలయాళం
2007 సూర్యన్ మాయ మలయాళం
2007 నస్రాని సరహ్ ఈపన్ మలయాళం
2007 రోమియో డా. ప్రియా మలయాళం
2008 కలకత్తా న్యూస్ స్మిత మలయాళం
2008 కాలేజ్ కుమరన్ మాధవి మీనన్ మలయాళం
2008 అపూర్వ లక్ష్మీదేవి మలయాళం
2008 రామన్ తేడియా సీతై రంజిత తమిళ
2009 ఎవరైనా ఎప్పుడైనా మధుమిత తెలుగు
2010 ఆప్తరక్షక నాగవల్లి కన్నడ
2010 గాయం-2 విద్య తెలుగు
2010 రంగ ది దొంగ మంగమ్మ తెలుగు
2011 రాజ్ ప్రియా తెలుగు
2011 చట్టం సింది తెలుగు
2011 ధమ్ 999 మీరా ఇంగ్లీష్/మలయాళం
2012 కులుమనాలీ ప్రవల్లిక తెలుగు
2012 నువ్వా నేనా విమలా రామన్ తెలుగు త త తామర పాటలో
2013 ముంబై మిర్రర్ జియా హిందీ
2013 చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సమీరా తెలుగు
2013 అమెజాన్ టర్నింగ్ పాయింట్ మడోన్నా మలయాళం
2015 రాజా రాజేంద్ర విమలా రామన్ కన్నడ అతిధి పాత్ర
2016 పోయి మరంజు పరాయతే స్వయంప్రభ మలయాళం
2016 ఒప్పం[5] దేవయాని మలయాళం
2017 ఓం నమో వేంకటేశాయ పద్మావతి దేవి తెలుగు
2019 ఇరుత్తు జిన్ తమిళ
2022 గ్రాండ్ మా ప్రియాంక తమిళ్
2023 అశ్విన్స్ ఆర్తి తమిళ్, తెలుగు
2023 రుద్రంగి మీరా భాయ్ తెలుగు
2023 గాండీవదారి అర్జున ప్రియా తెలుగు
2024 అంతిమ తీర్పు తెలుగు

మూలాలు

మార్చు
  1. "I’m a Bengaluru girl, says Vimala Raman"
  2. ఆంధ్రజ్యోతి, సినిమా (11 June 2020). "హాట్ పిక్స్‌తో టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ". www.andhrajyothy.com. Archived from the original on 19 June 2020. Retrieved 19 June 2020.
  3. "Vimala Raman crowned Miss India Australia". The Tribune. 28 October 2004. Retrieved 19 June 2020.
  4. తెలుగు గ్రేట్ ఆంధ్ర, సినిమా (11 June 2020). "అమెరికా జాత్యహంకారంపై హాట్ బ్యూటీ వినూత్న నిర‌స‌న‌". www.telugu.greatandhra.com. Retrieved 19 June 2020.
  5. "Vimala Raman as Mohanlal's heroine". The Times of India. 5 February 2016. Retrieved 19 June 2020.

ఇతర లంకెలు

మార్చు