కుల్చారం జైన దేవాలయం

కుల్చారం జైన దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, కుల్చారం మండలంలోని కుల్చారం గ్రామంలో ఉన్న జైన దేవాలయం.[1] రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 85 కిలోమీటర్ల దూరంలో, మెదక్‌ నుండి 15 కిలో మీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. 23వ జైనమత తీర్థంకరుడు పార్వ్శీనాథుడు ఏకశిలా విగ్రహంగా ఈ దేవాలయంలో కొలువై ఉన్నాడు.

కుల్చారం జైన దేవాలయం
కుల్చారం జైన దేవాలయంలోని జైనమత తీర్థంకరుడు పార్వ్శీనాథుడు
మతం
జిల్లామెదక్ జిల్లా
ప్రదేశం
ప్రదేశంకుల్చారం
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం

చరిత్ర మార్చు

వివిధ రాజవంశాలకు చెందిన రాజులు పరిపాలించిన కుల్చారం గ్రామంలో ఎక్క డ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. కాకతీయుల కాలం నుండి నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళుగా ఉన్నాయి. 1984లో వీరభద్రస్వామి దేవాలయం సమీపంలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వినపుడు శెల్యరాతితో చెక్కిన ఏకశిలతో దిగంబరంగా తలపై ఏడు సర్పాలు పడగకప్పి ఉన్న విగ్రహం బయటపడింది. తొమ్మిదిన్నర అడుగులున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా చరిత్రకారులు గుర్తించారు. జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహాన్ని త్రిభువన రాజు చెక్కించినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. ఆ విగ్రహాన్ని 1984 నుండి 1990ల చివరి వరకు స్థానికుల ఆధీనంలో ఉంది. గ్రామస్థులు ఆ విగ్రహాన్ని 'గ్రామ దేవత'గా భావించారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంకోసం ఆలిండియా జైన్‌ దిగంబర్‌ మహాసభ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలు వెచ్చించి 2002లో ప్రశాంత వాతావరణంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన జైన దేవాలయాన్ని నిర్మించారు.[1]

ఉత్సవాలు మార్చు

ఈ ఆలయంలో జరిగే నిత్య పూజలలో పాల్గొనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జైనులు ఎక్కువగా ఈ దేవాలయ సందర్శనకు వస్తుంటారు.

ఇతర వివరాలు మార్చు

ఇక్కడున్న దేవాస్థానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు, సందర్శకులకు అన్ని వసతులు కల్పించబడుతాయి. గెస్ట్ హౌజులు, ఫంక్షన్ హాల్ నిర్మించబడ్డాయి.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "కొల్చారం.. రండి చూసొద్దాం". Sakshi. 2018-04-28. Archived from the original on 2021-11-03. Retrieved 2021-11-02.
  2. టూరిస్ట్ ప్లేస్ గా జైన మందిరం, దర్వాజా (ఆదివారం సంచిక), వి6 ప్రభాత వెలుగు, 2021 అక్టోబరు 3.