కువెంపు

కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత

కుప్పళ్ళి వెంకటప్పగౌడ పుట్టప్ప (కన్నడ: ಕುಪ್ಪಳ್ಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ) ( 1904 డిసెంబరు 29 - 1994 నవంబరు 11)[1] కన్నడ భాషా రచయిత, కవి. అతను కన్నడ సాహిత్యంలో 20వ శతాబ్దానికి చెందిన అత్యంత గొప్పకవిగా గుర్తింపు పొందాడు. కన్నడం లో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన ఏడుగురిలో[2] అతను మొదటివాడు. పుట్టప్ప తన సాహిత్య రచనలన్నిటినీ కువెంపు అనే కలం పేరుతో రాసాడు. అతను రాష్ట్రకవిగా గౌరవించబడిన కన్నడ కవులలో రెండవ వాడు. (ఎం. గోవింద పాయ్ తరువాత). పురాతన భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధునిక కన్నడంలో తిరిగి రాసాడు. అతను రాసిన రచనలు శ్రీ రామాయణ దర్శనం, మహాకావ్య (ఇతిహాస పద్యాలు) ఈ యుగం సమకాలీన రూపంగా, ప్రయోగ పునరుద్ధరణగా భావించబడింది. అతను వాడిన కొన్ని పదబంధాలు, విశ్వ మానవతా వాదానికి అతను చేసిన సేవ వలన చిరస్థాయిగా నిలిచిపోయాడు. భారత ప్రభుత్వంచే అతను పద్మ భూషణ్ పురస్కారాన్ని పొందాడు. అతను కర్ణాటక రాష్ట్ర గీతమైన 'జయ భారత జననియ తనుజతే' ను రచిందాడు.

కుప్పలి వెంకటప్ప పుట్టప్ప
పుట్టిన తేదీ, స్థలం(1904-12-29)1904 డిసెంబరు 29
హిరెకొడిగెలో గ్రామం,కొప్ప తాలూకా, చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక
మరణం1994 నవంబరు 11(1994-11-11) (వయసు 89)
మైసూరు, కర్ణాటక
కలం పేరుకువెంపు
వృత్తిరచయిత, ప్రొఫెసర్
జాతీయతభారత దేశము
రచనా రంగంఫిక్షన్, కవిత్వం, నాటకం, వ్యాసాలు
సాహిత్య ఉద్యమంనవోదయ
ప్రభావంమోహన్ దాస్ కరంచంద్ గాంధీ, రామకృష్ణ పరమహంస
Website
http://www.kuvempu.com/
తపాలా బిళ్ళపై కువెంపు

జీవితచరిత్ర మార్చు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

 
కుప్పళ్ళిలోని కువెంపు యొక్క వారసత్వ గృహం

కువెంపు,చిక్‌మగళూరు జిల్లా, కొప్ప తాలూకాలోని హిరెకొడిగెలో ఒక స్థానిక కన్నడ కుటుంబంలో జన్మించాడు. అతను శివమొగ్గ జిల్లా లోని తీర్థహళ్లిలోని పచ్చని మాలెనాడు ప్రదేశంలో గల కుప్పళ్ళిలో పెరిగాడు. అతని విద్యాభ్యాసం గృహంలోనే, దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ప్రారంభమైంది. అతను తన మాధ్యమిక విద్యను కొనసాగించడానికి తీర్థహళ్లిలోని ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాలలో చేరాడు. 12 సంవత్సరాల చిన్న వయసులోనే అతని తండ్రి వెంకటప్ప గౌడ్ అనారోగ్యంతో మరణించాడు. కువెంపు తన ఉన్నత విద్యను కన్నడ, ఆంగ్ల భాషలలో తీర్థహళ్లిలో పూర్తిచేసాడు. అతను తన విద్యాభ్యాసం కొనసాగించడానికి మైసూర్ వెళ్లి అక్కడి వెస్లీ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసాడు. అతను తన విద్యాభ్యాసాన్ని మైసూర్‌ లోని మహారాజా కళాశాలలో కొనసాగించి 1929లో కన్నడ భాష ప్రధాన విషయంగా పట్టాను పొందాడు. అతను 1937 ఏప్రిల్ 30న హేమవతిని వివాహం చేసుకున్నాడు.

తర్వాత జీవితము మార్చు

ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కే పూర్ణచంద్ర తేజస్వి, కోకిలోదయ చైత్ర, ఇందుకళ, తరిణి. తరిణికి K. చిదానంద గౌడతో వివాహం జరిగింది, అతను కువెంపు విశ్వవిద్యాలయ పూర్వ ఉప-కులపతి. కువెంపు ప్రాపంచిక విషయాలపై కూడా కవితాపూర్వకంగా ప్రతిస్పందించారు. అతను కారు కొన్నపుడు "చక్రచరణకే స్వాగత!" (చక్రాల కాళ్ళకి స్వాగతం!) అని అన్నట్లు పేర్కొనబడింది. అతను తన గృహానికి "ఉదయరవి" (ఉదయిస్తున్న సూర్యుడు) అనే పేరు పెట్టుకున్నాడు. వ్యవసాయదారుడిని "ఉలువ యోగి" (దున్నే యోగి) అని పిలిచేవాడు. తన సందేశంలో సమసమాజాన్ని "సర్వరిగే సమపాలు, సర్వరిగే సమబాలు" (అందరికీ సమాన భాగం, అందరికీ సమాన జీవనం) అని వ్యవహరించాడు. ఇరవయ్యవ శతాబ్ద కన్నడ మేధో ప్రపంచంలో "సాహితీ విమర్శ సూత్రాల" "కావ్య మీమాంస" అయిన "రసో వై సహా" అతని ప్రసిద్ధ రచన. అతను కన్నడ భాషకు అనేక వందల నూతన పదాలు, పదబంధాలు, వైవిధ్య సంక్షిప్త భావనతో కూడిన పరిభాషను అందించి ప్రసిద్ధిచెందాడు; వీటిలో సాహిత్య, సాంఘిక, తాత్విక, ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి. ఇది సామాన్య ప్రజలు వారి బిడ్డలకు పేరు పెట్టవలసిందిగా దశాబ్దాల పాటు అతనిని తపాలా ద్వారా అడగటానికి దారితీసింది. దీనిని ఆయన స్వీకరించారు.

వృత్తి జీవితం మార్చు

కువెంపు, 1929లో మైసూర్ లోని మహారాజా కళాశాలలో కన్నడ భాష అధ్యాపకుడిగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. 1936 నుండి ఆయన బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో సహాయక ఆచార్యుడిగా పనిచేసాడు. 1946లో ఆయన మైసూర్‌లోని మహారాజా కళాశాలలో మరలా ఆచార్యుడిగా చేరాడు. 1955లో ఆయన మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. ఆ వెంటనే 1956లో అతను మైసూర్ విశ్వవిద్యాలయం ఉప-కులపతిగా ఎన్నికై 1960లో పదవీవిరమణ పొందేవరకు ఆ పదవిలో కొనసాగాడు. అతను మైసూర్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొంది ఆ స్థానానికి ఎదిగిన వారిలో మొదటివాడు.[3] 1957లో ధార్వాడలో జరిగిన 39వ కన్నడ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు.

రచనలు,సందేశాలు మార్చు

 
మైసూరులోని కువెంపు గృహం "ఉదయరవి"

కువెంపు తన సాహిత్య రచనను మొదట ఆంగ్లం లో, బిగినర్స్ మస్ అనే పద్య సంకలనంతో ప్రారంభించి, తరువాత కన్నడం లోకి మారాడు.

అతను విద్యా మాధ్యమంగా కన్నడ భాష ఉండాలని, "మాతృ భాషలలో విద్య" అనే భావనను నొక్కిచెప్పాడు. కన్నడ పరిశోధన అవసరాలు తీర్చడానికి, అతను మైసూర్ విశ్వవిద్యాలయంలో కన్నడ అధ్యయన సంస్థే (కన్నడ అధ్యయనాల సంస్థ)ను స్థాపించాడు. అతని పేరు మీదుగా దానికి కువెంపు ఇనిస్టిట్యూట్ అఫ్ కన్నడా స్టడీస్ అని పేరు పెట్టారు. మైసూర్ విశ్వవిద్యాలయ ఉప-కులపతిగా అతను బేసిక్ సైన్సెస్ అండ్ లాంగ్వేజెస్ అధ్యయనానికి దారిచూపాడు. అతను G. హనుమంత రావు ప్రారంభించిన నాలెడ్జ్ ఫర్ లేమెన్ ప్రచురణకు కూడా పూనుకున్నాడు.

కువెంపు ఒక రచయిత కంటే చాలా గొప్ప వాడు, అతని జీవన సరళి దానికదే ఒక గొప్ప సందేశం. అతను కులతత్వానికి, అర్ధం లేని పద్ధతులకి, ఆచారాలకి వ్యతిరేకి. "శూద్ర తపస్వి" (1946) వంటి కువెంపు రచనలు కూడా, జ్ఞానాన్ని సంపాదించడానికి శూద్రులు అర్హులు కారణే కుల వ్యవస్థ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. కువెంపు, (వొక్కలిగ కులానికి చెందినవారు) జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన తన శ్రీ రామాయణ దర్శనంలో పాత్రలను వాల్మీకి రామాయణం పాత్రల కంటే విభిన్న దృష్టికోణంలో చిత్రించాడు. ఈ రచన కన్నడం లో సంపూర్ణ రామాయణం. ఇది అతని దృష్టికోణమైన సర్వోదయను నొక్కిచెప్తుంది. (ప్రతి ఒక్కరి ఉద్ధరణ). అతను రాసిన రామాయణం లోని రాముడు దీనికి ప్రతిరూపంగా ఉండి, తన భార్య అయిన సీతతో పాటుగా పరీక్ష కొరకు అగ్నిప్రవేశం చేస్తాడు.

ఓ నన్న చేతనా, అగు నీ అనికేతన (ಓ ನನ್ನ ಚೇತನ, ಆಗು ನೀ ಅನಿಕೇತನ )కు అనువాదమైన "నా ఆత్మా బంధింపబడకు, అనంతం ఒక్కటే నీ లక్ష్యం" అనేది సార్వత్రిక మానవత్వంపై కువెంపు యొక్క ప్రసిద్ధ వాక్యం.

బెంగుళూరు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సందర్భంగా అతని ఉపన్యాసం, విచారక్రాంతిగే ఆహ్వాన అనే గ్రంథంలో ప్రచురింపబడింది. ఇది అభివృద్ధికరమైన రాజకీయాల పునరంగీకారానికి పిలుపునిస్తుంది. ఈ ఉపన్యాసం 1974లో ఇవ్వబడినప్పటికీ, సందేశం ఇప్పటి పరిస్థితులకి కూడా వర్తిస్తుంది.

1987వ సంవత్సరంలో, కర్ణాటక లోని శివమొగ్గ (షిమోగా) జిల్లాలో, కువెంపు పేరుతో ఒక నూతన విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ఇది షిమోగాకు 28 కిలోమీటర్ల దూరంలో జ్ఞాన సహ్యాద్రి కాంపస్ ‌లో ఉంది.

అతని కుమారుడు పూర్ణచంద్ర తేజస్వి బహుళ శాస్త్రవేత్త. అతను సాహిత్యం, ఛాయాచిత్రగ్రహణం, చేతి వ్రాత, డిజిటల్ ఇమేజింగ్, సామాజిక ఉద్యమాలు, వ్యవసాయ రంగాలలో విశేషకృషి చేస్తున్నాడు.

పురస్కారాలు మార్చు

గ్రంథ పట్టిక మార్చు

నవలలు మార్చు

  • కానూరు హెగ్గదటి (1936)
  • మాలెగలల్లి మదుమగలు (1967)

ఆధునిక కావ్యం (మహాకావ్య) మార్చు

  • శ్రీ రామాయణ దర్శనం, సంపుటి-1 (1949), సంపుటి-2 (1957)

పద్య సంకలనాలు మార్చు

  • కొలలు (1930)
  • పాంచజన్య (1936)
  • నవిలు (1937)
  • కిందరిజోగి మట్టు ఇతర కవనగళు (1938)
  • కొగిలే మట్టు సోవియట్ రష్యా (1944)
  • శూద్ర తపస్వి (1946)
  • కావ్య విహార (1946)
  • కింకిణి (1946)
  • అగ్నిహంస (1946)
  • ప్రేమ కాశ్మీర (1946)
  • చంద్రమంచకే బా చకోరి (1954)
  • ఇక్షుగంగోత్రి (1957)
  • కబ్బిగన కైబుట్టి
  • పక్షికాశి
  • జెనాగువా
  • కుటిచక
  • కదిరదకే
  • కథన కవనగళు

నాటకాలు మార్చు

  • బిరుగాలి (1930)
  • మహారాత్రి (1931)
  • శ్మశాన కురుక్షేత్రం (1931)
  • జలగార (1931)
  • రక్తాక్షి (1932)
  • శూద్ర తపస్వి (1944)
  • బెరల్గే కోరల్ (1947)
  • యమన సోలు
  • చంద్రహాస
  • బలిదాన

స్వీయచరిత్ర మార్చు

  • నేనాపిన దొనియాలి (1980)

కథల సంకలనాలు మార్చు

  • మలేనదిన చిత్రగళు (1933)
  • సన్యాసి మట్టు ఇతరే కతేగళు (1937)
  • నన్న దేవరు మట్టు ఇతర కతేగళు (1940)

సాహితీ విమర్శ మార్చు

  • అత్మశ్రీగగి నిరంకుశమతిగలగి (1944)
  • కావ్యవిహార (1946)
  • తపోనందన (1951)
  • విభూతి పూజే (1953)
  • ద్రౌపదీయ శ్రిముడి (1960)
  • విచార క్రాంతిగే ఆహ్వాన (1976)
  • సాహిత్యప్రచార

జీవితచరిత్ర మార్చు

  • స్వామి వివేకానంద (1926)
  • శ్రీ రామకృష్ణ పరమహంస (1934)
  • గురువినోదనే దేవరెడెగే

పిల్లల కథలు మార్చు

  • బొమ్మనహళ్లియ కిందరిజోగి (1936)
  • మరి విజ్ఞాని (1947)
  • మేఘపుర (1947)
  • నన్న మనే (1947)
  • నన్న గోపాల
  • అమలన కతే

దృశ్య మాధ్యమంలో కువెంపు రచనలు మార్చు

చలనచిత్రాలు మార్చు

మూలాలు మార్చు

  1. "The Gentle Radiance of a Luminous Lamp". Ramakrishna Math. Archived from the original on 2006-08-22. Retrieved 2020-04-09.
  2. "Jnanapeeth Awards". Ekavi. Archived from the original on 2006-04-27. Retrieved 2006-10-31.
  3. Bharati, Veena. "Poet, nature lover and humanist". Deccan Herald. Archived from the original on 2006-03-18. Retrieved 2006-09-02.
  4. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2010-11-11.

బాహ్య లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=కువెంపు&oldid=3965687" నుండి వెలికితీశారు