కూకట్ల తిరుపతి

కవి

కూకట్ల తిరుపతి వర్థమాన తెలుగు కవి, ఉపాధ్యాయులు.[1]

కూకట్ల తిరుపతి
కూకట్ల తిరుపతి
జననంతిరుపతి
(1975-06-05) 1975 జూన్ 5 (వయసు 49)
మద్దికుంట, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తిఉపాధ్యాయులు
కవి
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మి
పిల్లలుసాయి భారవి
తండ్రికనకయ్య
తల్లిఅంకవ్వ

జీవిత విశేషాలు

మార్చు

కూకట్ల తిరుపతి తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మద్దికుంట గ్రామంలో కూకట్ల అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్ 5న జన్మించాడు. కుటుంబం పేదరికం కారణంగా తన చదువు సాగలేదు. బాలకార్మికునిగా పనిచేస్తూ ఐదో తరగతివరకు రాత్రి బడిలో చదివాడు. తరువాత కొండపల్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు విధ్యనభ్యసించాడు. మాంచిర్యాలలో ఐ.టి.ఐ చదివిన తరువాత ఓపెన్‌ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యంలో డిగ్రీ పూర్తిచేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసాడు. తెలుగు పండిట్ శిక్షణ పూర్తి చేసిన తరువాత గంగారాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరాడు.[2]

ప్రచురించబడిన మొదటి కవిత

మార్చు

1996 నుంచి కవితలు రాయడం ప్రారంభించారు. పలు పత్రికల్లో అవి అచ్చయ్యాయి. 2000 సంవత్సరం ఆగస్టు, గోకుల ప్రభ మాస పత్రికలో మన జాతికే వెలుగంట అనే శీర్షికతో మొదటి కవిత ప్రచురితమైనది.[2]

ప్రచురించిన పుస్తకాలు[3]

మార్చు
 1. 2005 – మేలు కొలుపు (కవిత్వం)
 2. 2006 – చదువులమ్మ శతకం
 3. 2007 – పల్లె నానీలు
 4. 2015 – ఎర్రగాలు (కవిత్వం)[4]
 5. 2015 – ఆరుద్ర పురుగు (కవిత్వం)
 6. 2021 - తెలుగు బడి (బాల వాచకం)
 7. 2022 - జల్లెడ (సమీక్ష వ్యాసాలు)

[5]

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు
 1. "సాహిత్యం.. సర్వకాలీనం". m.andhrajyothy.com. 2022-03-19. Retrieved 2022-06-09.
 2. 2.0 2.1 నవతెలంగాణ, అంకురం. "బాలకార్మికుడి నుంచి భావ కవిత్వం దాకా.. 'కూకట్ల' మేలుకొలుపు". నవ తెలంగాణ. Archived from the original on 2021-03-03. Retrieved 10 September 2016.
 3. "కూకట్ల తిరుపతి – మయూఖ". Archived from the original on 2021-11-03. Retrieved 2022-06-09.
 4. బోయిని, సరోజన (2021-04-01). "ఎదయెదను తట్టిలేపే ఎన్నీల ఎలుగుల కైతలు". కొలిమి. Retrieved 2022-06-09.
 5. పత్రిక, విహంగ మహిళా. "రాతకోసం రాజీపడని కలం- 'ఆరుద్ర పురుగు'( పుస్తక సమీక్ష..) -లోకే. రాజ్ పవన్ |". Retrieved 2022-06-09.