తెలుగులో రూపొందించిన బ్లాగ్ ఇండెక్సింగ్ వెబ్ సైట్. తెలుగు బ్లాగర్లు, బ్లాగ్ వీక్షకులలో ఎక్కువ మంది కూడలి ద్వారానే బ్లాగులకి అనుసంధానమవుతుంటారు. కూడలి పోర్టల్ ని డిజైన్ చేసినది వీవెన్. ఈ పోర్టల్ ని 2006లో ప్రారంభించారు. 2016లో మూతబడింది.[1]

కూడలిసవరించు

కూడలి అనేది తెలుగు బ్లాగుల నుండి కొత్త టపాలని సేకరించి, వాటిని వర్గీకరించి సంబంధిత పేజీలలో చూపించే సంకలిని. కూడలి మీకు నచ్చితే, మీ బ్లాగు లేదా సైటు నుండి కూడలికి కలపాలి. తెలుగు బ్లాగావరణంలో తెలుగు బ్లాగుల నుండి ఫీడులను సంకలనించడం అనేది కూడలితోనే మొదలయ్యింది.

కూడలిలో బ్లాగు చేర్చాలను కుంటేసవరించు

మీ బ్లాగుని కూడలిలో చేర్చాలనుకుంటే, support ఎట్ koodali.org కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి. మీరు మెయిల్ పంపేముందు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి:

మీరు మెయిల్ పంపిన తర్వాత మీ బ్లాగు కూడలిలో కనబడడానికి దాదాపు ఒక రోజు నుండి రెండు రోజుల వరకు పట్టవచ్చు.
తెలుగులో వ్రాసే బ్లాగులని మాత్రమే కూడలిలో చేరుస్తారు.
మీ టపాలు అభ్యంతర రీతిలో ఉంటే, ఎటువంటి నోటీసు లేకుండానే మీ బ్లాగుని కూడలినుండి తొలగిస్తారు.

కూడలి యాజమాన్యం , నిర్వహణసవరించు

కూడలి యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలను వీవెన్, కినిగె వారికి బదిలి చేశారు.

మూలాలుసవరించు

  1. "కూడలి — సెలవు!". web.archive.org. 2016 [last update]. Retrieved March 29, 2016. Check date values in: |year= (help)

బయటి లింకులుసవరించు