కూనపరెడ్డి రాఘవేంద్రరావు

కూనపరెడ్డి రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో పెనుగొండ నియోజకవర్గం (ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం) నుండి స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కూనపరెడ్డి రాఘవేంద్రరావు

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
ముందు వంకా సత్యనారాయణ
తరువాత పీతాని సత్యనారాయణ
నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం (ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం)

వ్యక్తిగత వివరాలు

జననం 1944
పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2020 సెప్టెంబర్ 3
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం
తల్లిదండ్రులు వీర రాఘవయ్య

రాజకీయ జీవితం

మార్చు

కూనపరెడ్డి రాఘవేంద్రరావు అలియాస్ చినబాబు 1999లో పెనుగండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎంఎల్ఎగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. చినబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంతో ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసిపి ఆచంట నియోజకవర్గం కన్వీనర్‌గా పని చేశాడు.

కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) అనారోగ్యంతో బాధపడుతూ 2020 సెప్టెంబర్ 3న మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (3 September 2020). "పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. Mana Telangana (3 September 2020). "పెనుగొండ మాజీ ఎంఎల్ఎ చినబాబు కన్నుమూత". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.