పెనుగొండ (ప.గో)

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ మండల గ్రామం


పెనుగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ మండలానికి చెందిన గ్రామం.ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తణుకు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4320 ఇళ్లతో, 16038 జనాభాతో 1116 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7857, ఆడవారి సంఖ్య 8181. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1798 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 63. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588681.[2]

పెనుగొండ (ప.గో)
పెనుగొండ బస్సు నిలయం
పెనుగొండ బస్సు నిలయం
పటం
పెనుగొండ (ప.గో) is located in ఆంధ్రప్రదేశ్
పెనుగొండ (ప.గో)
పెనుగొండ (ప.గో)
అక్షాంశ రేఖాంశాలు: 16°39′24.8″N 81°44′46.0″E / 16.656889°N 81.746111°E / 16.656889; 81.746111
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంపెనుగొండ
విస్తీర్ణం11.16 కి.మీ2 (4.31 చ. మై)
జనాభా
 (2011)[1]
16,038
 • జనసాంద్రత1,400/కి.మీ2 (3,700/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు7,857
 • స్త్రీలు8,181
 • లింగ నిష్పత్తి1,041
 • నివాసాలు4,320
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534320
2011 జనగణన కోడ్588681

శ్రీ నగరేశ్వర వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానం ద్వారా పెనుగొండ పట్టణం సుప్రసిద్దం. ఈ నగరం పాలకొల్లు, నిడదవోలు ప్రధాన రహదారిలో ఉంది. పాలకొల్లుకు 15 కి.మీ. తణుకుకు 16 కి.మీ. దూరంలో ఉంది.

కన్యక వృత్తాంతం

మార్చు

పూర్తి వ్యాసం కొరకు చూడండి. కన్యకా పరమేశ్వరి :కన్యక లేదా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి పేరుతో కుసుమశ్రేష్టి పుత్రికగా జన్మించి విష్ణువర్ధనుడు అనే అహంకార రాజ్యాధిపతితో వివాహానికి అంగీకరించక ఆత్మత్యాగం చేసుకొనుట ద్వారా వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆరాద్య దైవంగా నిలిచిన యువతి. ఈమె దైవాంశ సంభూతురాలని ఆమె మరణానికి ముందు ఆమె దైవాంశను అందరూ దర్శించారని వాసవిదేవి గాథలలో వ్రాయబడి ఉంది.

నగర చరిత్ర

మార్చు

ఈ నగరం చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరం.రాజ్యపరిపాలన జరుగుతున్నకాలమందు ఈ ప్రాంతానికి పెనుగొండ రాజదానిగా ఉండేది.

దేవాలయాలు

మార్చు
 
కన్యకాపరమేశ్వరి ఆలయ గోపురం, ఆవరణ
 
పెనుగొండలో కల వాసవీధాం వద్ద ఉన్న 30 అడుగుల వాసవీమాత విగ్రహం

శ్రీ నగరేశ్వర స్వామివారి దేవస్థానం ఊరికి దక్షణాన కల అతి పురాతన దేవాలయం.మొదట ఈ దేవాలయం తక్కువ విస్తీర్ణం కలిగి చిన్న దేవాలయంగా ఉండేది. తదనంతరం దీనిలో అంతర్భాగంగా కన్యకా పరమేశ్వరీ దేవస్థానం కట్టడంతో అతి పెద్ద దేవాలయంగా వృద్ది చెందింది. ఈ దేవాలయం నిడవోలు, నర్సాపురం ప్రధాన కాలువ తీరాన ఉంది. శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం:ఆర్యవైశ్యుల కులదైవx శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. నిజానికి ఈ ఆలయం శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలోనే వేరొక ప్రక్క నిర్మింపబడింది. తరువాత గోపురం, విశ్రాంతి మందిరాలు, కళ్యాణ మండపం ఇత్యాదులతో అభివృద్ధి చేయుటచే పెద్ద యాత్రా స్థలంగా మారింది.

విద్యాలయాలు

మార్చు

నగరంలో ప్రదానంగా ఒకే ప్రాంగణంలో గల రెండు కళాశాలలు ఉన్నాయి.శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సైన్స్, ఆర్ట్స్ కళాశాల.దీనిని 1974 లో నిర్మించారు.జిల్లాలోని అన్ని కళాశాలలకన్న మిన్నగా ఉత్తీర్ణతాశాతం ఎక్కువగా ఉండేందుకు అహర్నిసలూ కృషి చేసే కళాశాల యాజమాన్యం ఈ కళాశాల ప్రధాన బలం. దీనిని చిన్న విశ్వవిద్యాలయం అని కుడా పిలుస్తారు.శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ, పితాని వెంకన్న జూనియర్ కళాశాల.ఈ కళాశాల డిగ్రీ కళాశాల కంటే ముందుగా నిర్మింపబడింది.

నగరంలో సౌకర్యాలు

మార్చు
  • బస్టాండ్స్. నగర ఉత్తరదిక్కున అన్ని సౌకర్యాలతో కూడిన అతి పెద్ద జవ్వాది రంగనాయకులు ప్రయాణీకుల విశ్రాంతి మందిరం {బస్టాండ్} ఉంది.
  • రక్షణభట నిలయం. (పోలీస్ స్టేషను) నగరం రెండు పోలీస్ స్టేషనుల పరిధిలో ఉంది. కాని రెండు పోలీస్ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.
  • ఎల్లాప్రగడ రామచంద్రరాజు మొమోరియల్ హాస్పిటల్ (కాలువ అవతల పాతవంతెన ప్రక్క)
  • గవర్నమెంట్ వారి ఆసుపత్రి {సిద్దాంతం మార్గంలో}
  • మార్కెట్ యార్డు {పాత మర్కెట్ వెనుక సిద్దాంతం మార్గంలో}
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ {కాలువ మార్గం}
  • వైశ్యాబ్యాంక్ {ఉన్నత పాఠశాల వద్ద}
  • సబ్ ట్రెజరీ కార్యాలయం {కన్యకా పరమేశ్వరీ దేవస్థానx వద్ద}
  • ప్రధాన తపాలా కార్యాలయం {జవ్వాది వారి వీధి}

వినోద సాధనాలు

మార్చు

ఊరిలో రెండు సినిమా ప్రదర్శన శాలలు ఉన్నాయి.

  • మొదటిది మినర్వా దియేటర్ ఇది మర్కెట్ ఎదురుగా ఉంది.
  • రెండవది ప్యాలెస్ ఇది సిద్దాంతం వైపు తిరిగే మలుపులో ఉంది. మినార్వా దియేటర్ జిల్లాలో ఉన్న పురాతన సినిమా దియేటర్లలో ఒకటి.

ఇవేకాక ప్రధాన కూడళ్ళలో పూర్వం నాటక ప్రధర్శన కొరకు నిర్మించిన కళా మండపాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ దసరా ఉత్సవాలకు పలు ప్రదర్శనలు జరుగును.

ప్రముఖులు

మార్చు
  • జమిందార్ జవ్వాది రంగనాయకులు నాయుడు
  • ఎంమ్మెల్యే కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు(చినబాబు)
  • ఎమ్మేల్యేగా పనిచేసిన పీతాని లక్ష్మీనారాయణ
  • ఎమ్మెల్సీగా పనిచేసిన మల్లుల లక్ష్మీనారాయణ
  • రామచంద్రరాజు ఎల్లాప్రగడ మొమొరియల్ హాస్పిటల్
  • సారదీ స్టూడియోస్ అధినేత, నటుడు సారధి కుటుంబ స్వస్థలం.

పెనుగొండ నియోజకవర్గం

మార్చు

పెనుగొండ 1952లో ఏర్పడింది. మొదటి సారి ఎన్నికలలో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుండి ద్వారంపూడి బసివిరెడ్డి ఎన్నికయ్యాడు.

పెనుగొండ నియోజక వర్గ ఎమ్మెల్యేలు

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,503. ఇందులో పురుషుల సంఖ్య 8308, మహిళల సంఖ్య 8195, గ్రామంలో నివాస గృహాలు 3948 ఉన్నాయి. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన తణుకు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4320 ఇళ్లతో, 16038 జనాభాతో 1116 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7857, ఆడవారి సంఖ్య 8181. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1798 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 63. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588681[2].పిన్ కోడ్: 534320.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల తణుకు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

పెనుగొండలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 8 మంది ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

పెనుగొండలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

పెనుగొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 128 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 111 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 875 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 111 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 875 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

పెనుగొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 875 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

పెనుగొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, అరటి, కూరగాయలు

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

ఇటుకలు, ట్రంకుపెట్టెలు & బకెట్లు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. 2.0 2.1 "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.