కూనపులి వెంకటేశ్వర్లు
కూనపులి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త.[1]
కూనపులి వెంకటేశ్వర్లు | |
---|---|
జననం | సా.శ. 1916 |
వృత్తి | అన్నామలై విస్వవిద్యాలయం లో భౌతిక శాస్త్ర శాఖకు ఫొఫెసర్ |
ప్రసిద్ధి | భౌతిక శాస్త్రవేత్త |
తండ్రి | పూర్ణయ్య |
జీవిత విశేషాలు
మార్చుకూనపులి వెంకటేశ్వర్లు కృష్ణా జిల్లా నూజివీడు గ్రామంలో జూన్ 3 1916లో జన్మించారు. ఈయన తండ్రిపేరు పూర్ణయ్య. ఈయన 1939 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి పట్టాను, 1946 లో డి.ఎస్.సి పట్టాను అందుకున్నారు. 1951 లో మద్రాసు రాష్ట్ర గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ కు స్పెషల్ ఆఫీసరుగా నియమితులైనారు. ఆయన ఆ శాఖలో 1953 వరకు పనిచేసారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర శాఖకు ఫొఫెసర్ గా, విభాగాధిపతిగా (1955-62) వరకు ఉన్నారు. కోయంబత్తూరు లోని పి.ఎస్.జి ఆర్ట్స్ కాలేజీ భౌతిక శాస్త్ర పరిశోధనాచార్యులుగా వుంటూ 1970-72 మధ్య పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గైడుగా ఉన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ఫెలోషిప్ ను 1957 లో అందుకున్నారు. 1947 లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ (లండన్) వారి ఫెలోషిప్ ను అందుకున్నారు. ఈయన "రామన్ ఫలితం" అంశం మీద అధ్యయనం చేసారు. పలు పరిశోధనా పత్రాలను వెలువరించారు. మెట్‌కాఫ్ బంగారు పతకాన్ని పొందారు.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు. కూనపులి వెంకటేశ్వర్లు (ఆగస్టు 2011 ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. p. 415.