కృతిక కమ్రా
కృతిక కమ్రా (ఆంగ్లం:krɪtɪka kaːmra; జననం 1988 అక్టోబరు 25)[1][2] భారతీయ సినిమా నటి, మోడల్.[3] టెలివిజన్ నటి కూడా అయిన ఆమె కితానీ మొహబ్బత్ హైలో ఆరోహి శర్మ, కుచ్ తో లోగ్ కహెంగేలో డా. నిధి, రిపోర్టర్స్‌లో అనన్య, ప్రేమ్ యా పహేలీ - చంద్రకాంతలో చంద్రకాంత వంటి పాత్రలు పోషించి టెలివిజన్ ఆయా ధారావాహికలతో ప్రసిద్ధి చెందింది. 2014లో ఆమె డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది. ఆమె 2018లో మిత్రోన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
కృతిక కమ్రా | |
---|---|
జననం | బరేలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1988 అక్టోబరు 25
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
హిందీ భాషా టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభకు ప్రతియేటా అందించే ఇండియన్ టెలీ అవార్డ్స్ ఆమెను 2009, 2012లో వరించగా, 2017లో నామినేట్ చేయబడింది.[4][5][6]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఆమె జన్మించింది.[7] ఆమె తండ్రి దంతవైద్యుడు, తల్లి పోషకాహార నిపుణురాలు. ఆమె మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో పెరిగింది.[8] ఆమె పాఠశాల విద్య సుఖ్‌పూర్‌లోని ఆనంద్ ప్రైమరీ స్కూల్, తారా సదన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లలో కొంతకాలం కొనసాగింది. ఆమె కాన్పూర్‌లో సెయింట్ జోసెఫ్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి తన మిడిల్ స్కూల్‌ను పూర్తి చేసి, ఆపై న్యూ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సెకండరీ, హయ్యర్ సెకండరీ చదువులను పూర్తిచేసింది.[9][10][11]
ఆమె తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ కోర్సులో చేరింది, అయితే, హిందీ టెలివిజన్ ధారావాహిక యహాన్ కే హమ్ సికందర్ లో నటిగా అవకాశం రావడంతో ఆమె చదువు మధ్యంతరంగా ఆగిపోయింది.
మూలాలు
మార్చు- ↑ "TV actors and their birthday bash pictures". The Times of India. 17 August 2015.
- ↑ "Kritika Kamra chooses Game Of Thrones cosplay for her birthday bash".
- ↑ "Kritika Kamra: I don't enjoy saas-bahu dramas". The Times of India.
- ↑ "ఆర్కైవ్ నకలు". web.archive.org. Archived from the original on 2016-01-15. Retrieved 2023-12-10.
- ↑ "ఆర్కైవ్ నకలు". web.archive.org. Archived from the original on 2018-12-27. Retrieved 2023-12-10.
- ↑ ".: #ITA2017 | The Indian Television Academy :". web.archive.org. 2017-11-08. Archived from the original on 2017-11-08. Retrieved 2023-12-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Chakraborty, Debashish (25 October 2019). "Kritika Kamra: Kritika Kamra latest photos, Style, Fashion Trends photos pics: These glamour-defining shots of the Mitron actress will melt your heart for good | Entertainment News". www.timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 14 February 2020.
- ↑ "Teacher's Day special: I'd make sure I never cross paths with my mum at school, says Kritika Kamra". Hindustan Times. 5 September 2020. Retrieved 5 July 2021.
- ↑ "Born in Uttar Pradesh, Kritika completed her High school and higher secondary schooling from Delhi Public School, Vasant Kunj, New Delhi".
- ↑ "Kritika Kamra: Kanpur feels like home". The Times of India. 5 December 2015.
- ↑ "Know more about Kritika Kamra #JDJ 7". Colors. Archived from the original on 16 September 2018. Retrieved 17 February 2016.