కృష్ణ బైరె గౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బైటరాయణపుర నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3]

కృష్ణ బైరె గౌడ

రెవెన్యూ శాఖ మంత్రి
పదవీ కాలం
2023 మే 27 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 – ప్రస్తుతం
ముందు నూతనంగా ఏర్పాటైంది
నియోజకవర్గం బైటరాయణపుర
పదవీ కాలం
2003 – 2008
ముందు సి బైరె గౌడ
తరువాత నియోజకవర్గం రద్దయింది
నియోజకవర్గం వేమగళ్

చైర్‌పర్సన్‌, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కర్ణాటక అసెంబ్లీ
పదవీ కాలం
2022 – 2023

గ్రామీణాభివృద్ధి & పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2018 – 2019
ముందు హెచ్. కే. పాటిల్
తరువాత కే.ఎస్. ఈశ్వరప్ప

న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
2018 – 2019
ముందు టీ. బి. జయచంద్ర
తరువాత జె. సి. మధు స్వామి

వ్యవసాయశాఖ మంత్రి
పదవీ కాలం
2013 – 2018
ముందు లక్ష్మణ్ సవ్వడి
తరువాత ఉమేష్ కట్టి

వ్యక్తిగత వివరాలు

జననం (1973-04-04) 1973 ఏప్రిల్ 4 (వయసు 51)
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు సి బైరె గౌడ

జననం, విద్యాభాస్యం

మార్చు

కృష్ణ బైరే గౌడ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సి బైరెగౌడ, సావిత్రమ్మ దంపతులకు 1973 ఏప్రిల్ 4న జన్మించాడు. ఆయన తండ్రి సి. బైరే గౌడ కర్ణాటక రాష్ట్ర సీనియర్ శాసనసభ్యుడు, మంత్రి, వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1996 నుండి 1999 వరకు కర్ణాటక ముఖ్యమంత్రి జె.హెచ్. పటేల్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు.

కృష్ణ బైరే గౌడ కృష్ణ బైరేగౌడ నర్సాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ముద్దెనల్లి సత్యసాయి పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశాడు. ఆయన నేషనల్ కాలేజ్ బసవనగుడిలో తన పి.యూ పూర్తి చేసి 1994లో బెంగుళూరులోని క్రైస్ట్ కాలేజీ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1999లో వాషింగ్టన్, డీసీలోని అమెరికన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సర్వీస్ నుండి ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

కృష్ణ బైరే గౌడ 2003లో తన తండ్రి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ జనతాదళ్ నాయకుడు సి. బైరేగౌడ మరణాతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి వెంగల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఏప్రిల్ 2004లో భారత ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ జనతాదళ్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • గ్రామీణాభివృద్ధి & పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, కర్ణాటక ప్రభుత్వం, మే 2018 - 2019
  • వ్యవసాయ శాఖ మంత్రి, కర్ణాటక ప్రభుత్వం, మే 2013 - 2018
  • అధ్యక్షుడు, కర్ణాటక ప్రదేశ్ యువజన కాంగ్రెస్, 2007-మార్చి 2011
  • బైటరాయణపుర, బెంగళూరు, 2008-ప్రస్తుత శాసనసభ సభ్యుడు
  • వెమగల్ శాసనసభ సభ్యుడు, కోలార్ జిల్లా, కర్ణాటక, 2003–2004, 2004–2007
  • అధ్యక్షుడు, కర్ణాటక యూత్ కాంగ్రెస్ కమిటీ. (2007-2011)
  • ప్రాజెక్ట్ అసోసియేట్, డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ ఇంక్. వాషింగ్టన్, DC, 2003
  • 2000-2002లో పూర్వీకుల వ్యవసాయ భూములను చూసుకున్నారు
  • ప్రాజెక్ట్ అసోసియేట్, ఇథియోపియన్ ఎంబసీ, వాషింగ్టన్, DC, 1998–99

మూలాలు

మార్చు
  1. Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  2. Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  3. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.