కృష్ణ శతకము
కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం. ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు. ఇది ఇది శ్రీకృష్ణునికి అంకితమివ్వబదినది.[1]
కృష్ణ శతకం | |
---|---|
కవి పేరు | శ్రీ నృసింహ కవి |
ఆంగ్లంలో పేరు | krishna sathakam |
వ్రాయబడిన సంవత్సరం | 18వ శతాబ్దం |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | కృష్ణా! |
విషయము(లు) | కృష్ణ లీలలు, దశావతారములు |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | కందపద్యాలు |
మొత్తం పద్యముల సంఖ్య | 102 |
అంతర్జాలం లో | వికీసోర్సు లో కృష్ణ శతకం |
అంకితం | కృష్ణుడు |
కీర్తించిన దైవం | కృష్ణుడు |
శతకం లక్షణం | భక్తి శతకం |
కవి పరిచయంసవరించు
కృష్ణ శతక కర్త నృసింహ కవి. అతను దాదాపు క్రీ.శ 1760 ప్రాంతమువాడు. అతని గురించి సమాచారం లభ్యం కాకపోయినా అతను రాసిన శతకములో వాడిన పదాల ఆధారంగా అతను చిత్తూరు మండలమునకు చెందినవాడని లేదా రాయలసీమ ప్రాంతము వాడనీ ఊహించవచ్చును. ఈ శతకం చివరలో ఈ కవి తనను గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు.[2]
భారద్వాజసగోత్రుడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహాహ్వయుడన్
శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణా
అతను రాసిన "తిరిమణి మనుజుడు పరమ పవిత్రుండు" అను పద్యమును బట్టి అతను వైష్ణవ మతానికి చెందిన వాడు కావచ్చు.
శతక విశేషాలుసవరించు
ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. ఈ శతకము లోని మొదటి పద్యం :
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1||
మూలాలుసవరించు
- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "కృష్ణ శతకము : స్తోత్రాలు కీర్తనలు : అలమార : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-29.
- ↑ "కృష్ణ శతకము -నృసింహకవి - అచ్చంగా తెలుగు". www.acchamgatelugu.com. Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-29.
బాహ్య లంకెలుసవరించు
- "ఆంధ్రభారతి - శతకములు - కృష్ణ శతకము". telugubharati.com. Retrieved 2020-04-29.[permanent dead link]