కె. ఎం. మున్షీ
కె. ఎం. మున్షీ (డిసెంబరు 30, 1887 - ఫిబ్రవరి 8, 1971) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రచయిత, మానవతావాది. కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
కె.ఎం.మున్షీ | |
---|---|
జననం | 30 డిసెంబర్ 1887 |
మరణం | 1971 ఫిబ్రవరి 8 | (వయసు 83)
వృత్తి | రాజకీయవేత్త, లాయర్, రచయిత |
రాజకీయ పార్టీ | స్వరాజ్ పార్టీ, కాంగ్రెస్ |
పిల్లలు | జగధీష్ మున్షీ, లతా మున్షీ, గిరీష్ మున్షీ |
తల్లిదండ్రులు |
|
బాల్యం
మార్చుమున్షీ గుజరాత్ లో 1887డిసెంబర్ 30న బ్రోచ్ లో జన్మించారు. తండ్రి రెవెన్యూశాఖలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లి తాపీ బెహన్ ఇంట్లోనే ఉంటూ పిల్లలకు చదువు చెప్పేది. మున్షీ 15వ ఏట తండ్రి మానెక్ లాల్ చనిపోయాడు.
విద్యాభ్యాసం
మార్చుఇంటర్ వరకూ గుజరాత్ లో చదువుకున్న మున్షీ, డిగ్రీ కోసం ముంబై వచ్చాడు. 1905లో బీఏ, 1910లో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. అనంతరం ముంబైలో లాయర్ గా స్థిరపడ్డారు.
అలవాట్లు
మార్చుమున్షీ తన 9వ ఏట నుంచే డైరీ రాసేవారు. రోజు భగవద్గీతలోని ఓ వ్యాక్యాన్ని ముందు రాసి, డైరీని మొదలు పెట్టేవారు. ఉత్తరాలు కూడా రాసే అలవాటుంది. స్నేహితులకు, బందువులకు ఉత్తరాలు రాస్తూ సలహాలు ఇస్తుండేవారు.
రచనలు
మార్చువెర్ని వసూలత్, స్నేహసంభ్రమ, భగ్న పాదుక, తపస్విని ఈ నవలలను మన దేశ భాషలకే కాక ఇతర దేశ భాషల్లోకి అనువదించారు. మొత్తం 56 గ్రంథాలను రాశారు.
రాజకీయ ప్రవేశం
మార్చుముంబైలో లాయర్ గా పేరు ప్రతిష్టలు గడించిన ఆయన తన ఆదాయంలో కొంత భాగం పేదలకు దానం చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ , మహాత్మగాందీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి ప్రముఖుల అభిమానాన్ని చూరగొన్నారు.1939లో భారతీయ విద్యాభవన్ స్థాపించి విద్యా, సాహితీ సేవలు అందించారు. హైదరాబాద్ నిజాం దగ్గర అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ రాయబారిగా పనిచేశారు. స్వాతంత్ర్యం తర్వాత 1950-52వరకు కేంద్రమంత్రిగా, ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. 1971ఫిబ్రవరి 8న మరణించారు. [1]
మూలాలు
మార్చు- ↑ సాహిత్యవేత్తలు:పేజీ నంబర్ 42