కొత్తపల్లి నారికేళ్లపల్లి

(కె.ఎన్.పల్లి నుండి దారిమార్పు చెందింది)

కొత్తపల్లి నారికేళ్లపల్లి ,గుంటూరు జిల్లా,చుండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్తపల్లి నారికేళ్లపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొత్తపల్లి నారికేళ్లపల్లి is located in Andhra Pradesh
కొత్తపల్లి నారికేళ్లపల్లి
కొత్తపల్లి నారికేళ్లపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°09′28″N 80°34′26″E / 16.1577162°N 80.5739664°E / 16.1577162; 80.5739664
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చుండూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామపంచాయితీ మార్చు

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గుమ్మా కోటేశ్వరమ్మ, 150 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
  • ఈ గ్రామ సర్పంచి శ్రీమతి గుమ్మా కోటేశ్వరమ్మకి ఒక అరుదైన ఆహ్వానం అందినది. ఈమె తన స్వంత భూమి ఒక ఎకరంతోపాటు, మరియొక ఐదు ఎకరాలు కౌలుకు తీసికొని, సమగ్ర యాజమాన్య పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధించుచున్న మహిళా రైతు గా ఈమె గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె కృషిని గుర్తించిన కేంద్ర వ్యవసాయశాఖ వారు, తమ శాఖ ఆధ్వర్యంలో గుజరాతు రాష్ట్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సుకు విచ్చేయాలని ఆహ్వానించి, ఉత్తమ మహిళా రైతుగా అభినందించుచూ ఈమెకు ప్రశంసాపత్రం అందజేసినారు. [2]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.