కె.కె.రంగనాథాచార్యులు

కె.కె.రంగనాథాచార్యులు (కేకేఆర్‌) సాహితీ చరిత్రకారుడు, భాషావేత్త. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ఆచార్యులుగా, డీన్‌గా పని చేసారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలకు ప్రిన్సిపాల్‌గా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.[1]

కోయిల్ కందాడై రంగనాథాచార్యులు
కె.కె.రంగనాథాచార్యులు
జననం
కోయిల్ కందాడై రంగనాథాచార్యులు

(1941-06-14) 1941 జూన్ 14 (వయసు 83)
మరణం2021 మే 15(2021-05-15) (వయసు 79)
హైదరాబాదు
మరణ కారణంకరోనా వ్యాధి
విద్యఎం.ఎ. (తెలుగు, సంస్కృతం, లింగ్విస్టిక్స్), పి.హెచ్.డి (భాషాశాస్త్రం)
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిఆచార్యుడు, డీన్
కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి
గుర్తించదగిన సేవలు
ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు

కెరీర్

మార్చు

కె. కె. ఆర్ పూర్తి పేరు కోయిల్ కందాడై రంగనాథాచార్యులు. వీరు 1941 జూన్‌14న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌ దేవాలయ ఆవరణలో ఆయన పెరిగారు. రంగనాథాచార్యులు తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో ఎం.ఎ. చేశారు. భాషాశాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి చేసి డాక్టరేట్‌ పొందారు. కెరీర్ మొదట్లో నాంపల్లిలోని ఓ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసారు. తరువాత 1967 నుంచి 1987 వరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసారు. అధ్యాపకుడిగా, ప్రధానాచార్యుడిగా, పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన ‘సారస్వత వేదిక’ పేరుతో ఆధునిక సాహిత్యంలో వివిధ అంశాలపై పలు సదస్సులు నిర్వహించి చర్చలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, డీన్‌గా పని చేసి 2003లో ఉద్యోగ విరమణ చేశారు.

రచనలు

మార్చు
  1. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు[2]
  2. తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక
  3. తెలుగులో తొలి సమాజ కవులు
  4. తెలుగు సాహిత్య వికాసం
  5. నూరేళ్ల తెలుగునాడు[3]
  6. రాచకొండ విశ్వనాథశాస్త్రి[4]
  7. తెలుగు సాహిత్యం మరో చూపు
  8. తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం
  9. చందు మీనన్ (అనువాదం. మూలం: టి.సి.శంకర మీనన్)[5]
  10. తొలినాటి తెలుగు కథానికలుః మొదటినుంచి 1930 వరకు తెలుగు కథానికల పరిశీలన

80 ఏళ్ళ వయసులో ఆచార్య కొవెల్‌ కందాళై రంగనాథాచార్యులు(కేకేఆర్‌) కొవిడ్‌తో పోరాడుతూ హైదరాబాద్‌లో 2021 మే 15న తుదిశ్వాస విడిచారు.[1] ఆయనకు భార్య ఊర్మిళ, కుమారుడు సుమన్‌, కుమార్తె సలిల ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "భాషావేత్త కె.కె.రంగనాథాచార్యులు కన్నుమూత". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు పుస్తకప్రతి
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నూరేళ్ల తెలుగునాడు పుస్తకప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో రాచకొండ విశ్వనాథశాస్త్రి
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో చందు మీనన్ పుస్తకప్రతి