కె.చిన్న అంజనమ్మ

తోలుబొమ్మలాట కళాకారిణి

కె.చిన్న అంజనమ్మ తోలుబొమ్మలాట కళాకారిణి. ఈమెకు కేంద్ర సంగీత నాటక అకాడమీ 2010లో అవార్డును ప్రకటించింది.

కె.చిన్న అంజనమ్మ
జననం1957
ధర్మవరం, అనంతపురం జిల్లా
ప్రసిద్ధితోలు బొమ్మలాట కళాకారిణి
తండ్రిసిండె నారాయణప్ప
తల్లిశాంతమ్మ

విశేషాలు

మార్చు

చిన్న అంజనమ్మ అనంతపురం జిల్లా, ధర్మవరంలో 1957లో జన్మించింది. కళాకారుల కుటుంబంలో జన్మించిన ఈమెకు తన తల్లిదండ్రులు సిండె నారాయణప్ప, శాంతమ్మలు తోలుబొమ్మలాటను తన నాలుగవ యేటి నుండే నేర్పించారు. ఈమె తోలుబొమ్మలను తయారు చేయడం, కత్తిరించడం, రంగులు అద్దడం, తోలుబొమ్మలను ఆడించడం, కథను చెప్పడం మొదలైన అంశాలలో ప్రావీణ్యతను సంపాదించుకుంది. ఈమె ఆంధ్రప్రదేశ్లోని అనేక పట్టణాలలో, గ్రామాలలో తన ప్రదర్శనను ఇచ్చింది. ఈమె అనేక ఉత్సవాలలో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈమె 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్‌లో మన దేశం తరఫున పాల్గొన్నది.[1]

మూలాలు

మార్చు