కె.సి.శివరామకృష్ణన్
కె.సి.శివరామకృష్ణన్ ఐ.ఎ.ఎస్.అధికారి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిపుణుల కమిటీ ఛైర్మన్.
జీవిత విశేషాలు
మార్చుఉద్యోగం
మార్చుతమిళనాడుకు చెందిన శివరామకృష్ణన్ 1958 లో పశ్చిమ బెంగాల్ ఐఎఎస్ క్యాడర్‌లో ఉద్యోగ వృత్తిని ప్రారంభించారు. కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారటీికి కార్యదర్శిగా వ్యవహరించారు. అనంతరం 1985లో కేంద్ర గంగ అథారిటీ మొదటి డైరక్టర్‌గా నియమితులయ్యారు. తరువాత కేంద్ర ప్రభుత్వంలో అనేక స్థాయిల్లో ఉన్నత పదవులను నిర్వహించారు. ఆయన పట్టణ ప్రణాళిక కార్యదర్శిగా కూడా పనిచేశారు.
శివరామకృష్ణన్ కమిటీ
మార్చుఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని ఎంపిక కోసం కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ నియమించిన ఐదుగురు సభ్యులు నిపుణుల కమిటీకీ శివరామకృష్ణన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.తుది నివేదికను 2014, ఆగస్టు 31లోపు అందజేయాలని కేంద్ర హౌం శాఖ శివరామకృష్టన్ కమిటీని ఆదేశించింది. కమిటీ తన నివేదికను కేంద్రం చెప్పిన రోజు కంటే ముందే ఆగస్టు 29న అందజేసింది. కమిటీ తన నివేదికలో మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా చూడొచ్చునని తెలిపింది.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రాజధాని ప్రాంతాన్ని ఆ కమిటీ వ్యతిరేకించింది. కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపడుతోంది. అమరావతి ప్రాంతంలో వరదలు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాని రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ నివేదికలోని ఒక్క అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.[1]
మరణం
మార్చుఆయన గురువారం మే 28 2015 న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు. గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.[2]
మూలాలు
మార్చు- ↑ "రాజధాని' కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-14.
- ↑ "Centre For Policy Research Chief K C Sivaramakrishnan Dies At Age 80". Archived from the original on 2015-06-11. Retrieved 2015-07-14.