కె. సుధాకర్
కేశవరెడ్డి సుధాకర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చిక్బల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆ తరువాత 6 ఫిబ్రవరి 2020 – 13 మే 2023 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2]
కె. సుధాకర్ | |||
క్యాబినెట్ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 6 ఫిబ్రవరి 2020 – 13 మే 2023 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2013 – ప్రస్తుతం | |||
ముందు | కె. పి. బచే గౌడ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చిక్కబళ్లాపూర్ | ||
చిక్బల్లాపూర్ జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
పదవీ కాలం ఏప్రిల్ 2020 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చిక్కబళ్లాపూర్, కర్ణాటక, భారతదేశం | 1973 జూన్ 27||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ ( 2019 వరకు) | ||
జీవిత భాగస్వామి | ప్రీతీ | ||
సంతానం | 3 | ||
నివాసం | సదాశివనగర్ , బెంగుళూరు |
రాజకీయ జీవితం
మార్చుకె. సుధాకర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జులై 2019లో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2019లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి,[3] 2020 ఫిబ్రవరి 6 నుండి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా పని చేశాడు.[4] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఓడిపోయాడు.[5]
డాక్టర్ కె సుధాకర్‌ను 2024లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ చిక్కబళ్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా ప్రకటించింది.[6][7]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ India TV (9 December 2019). "Chikkaballapur Constituency Bypoll Result: BJP's K Sudhakar wins seat with comfortable margin of 34,801 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Sakshi (14 May 2023). "స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ News18 (25 March 2024). "Karnataka BJP Lok Sabha List: Ananth Kumar Hegde Dropped, Setback for Sadananda Gowda Too" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (26 March 2024). "నాడు ఓడినా.. నేడు సత్తా చాటేదెలా?". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.