కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్

కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (బ్లాస్టర్స్ అని సాధారణంగా పిలువబడుతుంది) కేరళలోని కొచ్చి నగరంలోని ఒక భారతీయ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్, ఇది ఇండియన్ సూపర్ లీగ్ (ఐ.ఎస్.ఎల్.)లో పోటీ చేస్తుంది. ఇది భారతదేశంలోని అగ్రశ్రేణి ఫుట్‌బాల్ గ్రూప్. ఈ క్లబ్ 2014 మే నెలలో ఐఎస్ఎల్ ప్రారంభ సీజన్‌లో స్థాపించబడింది.

ఈ క్లబ్ 2014 అక్టోబరు 13న తమ మొదటి మ్యాచ్ ఆడినప్పుడు నార్త్ ఈస్ట్ యునైటెడ్ చేతిలో 1-0తో ఓడిపోయింది.[1] అయితే, మొదటిసారే ఇండియన్ సూపర్ లీగ్ 2014 ఫైనల్లోకి ప్రవేశించారు, అక్కడ వారు ఎ.టి.కె. ఫుట్ బాల్ క్లబ్ ఇంజ్యూరీ టైమ్ గోల్ చేసిన చేయడంతో 1-0తో ఓడిపోయారు.[2][3] 2016, వారు మళ్లీ ఎటికె చేతిలో 3-4తో ఓడిపోయారు, ఈసారి ఫైనల్లో పెనాల్టీల వల్ల ఓడిపోయారు.[4] క్లబ్ 2022 మూడవసారి ఫైనల్లోకి ప్రవేశించింది, అక్కడ వారు పెనాల్టీల ద్వారా హైదరాబాద్ ఎఫ్సి చేతిలో 3-1తో ఓడిపోయారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో బ్లాస్టర్స్ అలా మొత్తానికి మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది.[5] కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం బ్లాస్టర్స్‌కి స్వంత గడ్డ కింద లెక్క. క్లబ్ స్థాపించినప్పటి నుండి చాలా సీజన్లలో, కేరళ బ్లాస్టర్స్ అత్యధిక లీగ్ హాజరు రికార్డును కలిగి ఉంది, ప్రతి ఆటకు 30,000 మందికి పైగా ప్రేక్షకులను క్రమం తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ క్లబ్ దక్షిణ భారత పొరుగు క్లబ్‌లైన బెంగళూరు ఎఫ్సి, చెన్నైయిన్ ఎఫ్సిలతో పోటీపడుతుంది, వీరితో వారు దక్షిణ భారత డెర్బీకి పోటీ చేస్తారు.

ఆసియాలో అత్యంత విస్తృతంగా అభిమానుల మద్దతు కలిగిన క్లబ్‌లలో బ్లాస్టర్స్ ఒకటి, అలాగే ఆసియాలోని ఫుట్బాల్ క్లబ్‌లలో అతిపెద్ద సోషల్ మీడియా ఆదరణ కలిగి ఉంది. మంజప్పడ అన్న పేరున్న వాళ్ళ అభిమానుల సమూహం కూడా బాగా పేరొందింది. ఈ అభిమానులు తమ జట్టుకు చాలా బాగా మద్దతునిస్తారన్న పేరుంది. ఈ ఫుట్‌బాల్ క్లబ్ చిహ్నంగా (క్రెట్) ఒక ఏనుగు తన కొమ్ముతో ఫుట్‌బాల్ పట్టుకున్నట్టు ఉంటుంది. ఇది కేరళకూ ఫుట్‌బాల్‌కూ ఉన్న లోతైన అనుబంధాన్ని సూచిస్తుంది.[6] సంప్రదాయికంగా ఈ క్లబ్ కిట్‌లో పసుపు, నీలి రంగులు ఎక్కువగా ఉంటాయి, అందులో పసుపు రంగు ప్రాథమికంగా ఈ క్లబ్‌ చిహ్నంగా ఉంది, ఇదే అన్నిటా క్లబ్‌కు గుర్తుగా ఉంటూ వస్తుంది.[7]

మూలాలు

మార్చు
  1. "ISL: NorthEast United FC beat Kerala Blasters 1–0". The Times of India. 13 అక్టోబరు 2014. Archived from the original on 15 అక్టోబరు 2014. Retrieved 18 జనవరి 2015.
  2. "Kerala Blasters FC Beat Chennaiyin FC 4–3 to Advance to ISL Final". New Indian Express. 16 డిసెంబరు 2014. Archived from the original on 24 డిసెంబరు 2014. Retrieved 19 జనవరి 2015.
  3. "ISL: Atletico de Kolkata beat Kerala Blasters 1–0 to win title". The Times of India. 20 డిసెంబరు 2014. Archived from the original on 26 డిసెంబరు 2014. Retrieved 19 జనవరి 2015.
  4. Ghosh, Sayan (19 డిసెంబరు 2016). "Atletico de Kolkata beat Kerala Blasters 4–3 on penalties to win ISL 2016". Hindustan Times. Archived from the original on 27 జూలై 2017. Retrieved 26 జూలై 2017.
  5. "Bengaluru FC enter Super Cup semifinals after 1-1 draw against Kerala Blasters". ESPN.com (in ఇంగ్లీష్). 2023-04-17. Archived from the original on 21 April 2023. Retrieved 2023-04-28.
  6. "Kerala Blasters FC launch logo". Indian Super League. 15 సెప్టెంబరు 2014. Archived from the original on 29 జూలై 2017. Retrieved 26 జూలై 2017.
  7. "Directors Message on 7 Years of KBFC". Kerala Blasters FC. 2021-05-27. Archived from the original on 28 June 2021. Retrieved 2021-07-13.

బయటి లింకులు

మార్చు