కేశిరాజు సత్యనారాయణ

కేశిరాజు సత్యనారాయణ గణిత శాస్త్ర విద్యావేత్త. ఆయన క్షేత్రమితి, జ్యామితి[1] లలో విశిష్ట పరిశోధనలు చేసి అంతర్జాతీయంగా గణుతికెక్కిన గణిత శాస్త్రవేత్త.[2]

జీవిత విశేషాలు

మార్చు

కేశిరాజు సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి సమీపాన గల మలకపల్లి గ్రామంలో 1897లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి గణితశాస్త్రంలో బి.ఎ (ఆనర్స్) చేసారు. ఎం.ఎ, బి.యి.డి డిగ్రీలను కూడా పొందారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసారు.అతను పనిచేసే కాలంలో ప్రిన్సిపాల్ గా ఓ.జె.కూల్ట్రే, శొంఠి పురుషోత్తం వంటి మహామహులు పనిచేసారు.

ఆయన గణిత పరిశోధనలు చేసారు. పదోన్నతులు అందుకొని ఆ కళాశాలకు ప్రధానాధ్యాపకునిగా పనిచేసారు. మూడున్నర దశాబ్దాల పాటు గణిత పరిశోధకులుగా, ఉపన్యాసకులుగా రాణించారు. ఆయన విద్యార్థి దశ నుండి కళాశాల ప్రిన్సిపాల్ స్థాయి వరకు గణిత శాస్త్రంలో విశేష పరిశోధనలు చేశారు. అనేక పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించారు. అనేక నూతన గణిత సూత్రాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా "కోణముల" విభాగంలో ఈయన కనుగొన్న సూత్రాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనేకానేక పరిశోధనా వ్యాసాలను రాసారు. the Journal of the Indian Mathematical Society, The mathematics Student మొదలైన విదేశీ ప్రముఖ పత్రికలలో అతను రాసిన వ్యాసాలు ప్రచురితమై అంతర్జాతీయ గణిత మేథావుల ప్రశంసలను అందుకున్నాయి. స్వల్ప వ్యవథిలో ఖండాతర ఖ్యాతి లభించింది.[2]

రచనలు

మార్చు

ఈయన గణిత సంబంధిత తెలుగు గ్రంథములు వ్రాసినట్లు ఆహ్దారాలు లేవు. కానీ 1962లో యాంగిల్స్ అండ్ ఇన్ ఎక్స్-ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ టెర్రాహైడ్రా", 1978 లో పోరిస్టిక్ థియరీ మొదలైన ఆంగ్ల గ్రంథాలు వ్రాసారు.[3][4] విద్యార్థి దశ నుండి జీవిత పర్యంతం గణిత శాస్త్ర అధ్యయనానికి, పరిశోధనలకే కృషి చేసారు.

అస్తమయం

మార్చు

ఆయన హైదరాబాదులో తన 88వ యేట 1985 ఆగస్టు 13 న మరణించారు.

మూలాలు

మార్చు
  1. geometry by kesiraju satyanarayana
  2. 2.0 2.1 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). విజయవాడ: శ్రి వాసవ్య. 1 August 2011. p. 110.
  3. "national library". nationallibrary.gov.in/. నేషనల్ లైబ్రరీ. Retrieved 12 May 2016.[permanent dead link]
  4. "national library in australia". trove.nla.gov.au/. Retrieved 12 May 2016.

ఇతర లింకులు

మార్చు