కేశుభాయ్ పటేల్
కేశూభాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతాపార్టీ తరపున రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
జీవిత విశేషాలు
మార్చు1930 జూలై 24 న జన్మించిన కేశూభాయి పటేల్ (Keshubhai Patel) గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. మొదటి పర్యాయం 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు, మళ్ళీ రెండో పర్యాయం 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాడు. ఇతడు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.
2001 లో గుజరాత్ లో, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు ఆశించినంత విజయం లభించకపోవుటచే, ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని ఇతనిపై ఒత్తిడి రావడంతో కేశూభాయి పదవి నుంచి తప్పుకొన్నాడు. అతడి స్థానంలో నరేంద్ర మోడి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించాడు.
2012 ఆగస్టు 6న గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించాడు.
మరణం
మార్చు2020 సెప్టెంబరులో కేశూభాయికి కోవిడ్-19 వ్యాధి సోకింది. తరువాత అది తగ్గింది. మళ్ళీ 2020 అక్టోబరు 29 న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆసుపత్రిలో చేరి అక్కడే కోవిడనంతర అనారోగ్యాల కారణంగా మరణించాడు.[1][2]
బయటి లింకులు
మార్చు
మూలాలు
మార్చు- ↑ "Former Gujarat chief minister Keshubhai Patel passes away". India TV. 29 October 2020. Archived from the original on 29 October 2020. Retrieved 29 October 2020.
- ↑ "Former Gujarat CM Keshubhai Patel (Kesu Bapa) dies of heart attack - The Thinkera" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-29. Archived from the original on 2021-05-09. Retrieved 2021-03-09.