కేసనవారిపాలెం

కేసనవారిపాలెం గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. [1]

కేసనవారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నిజాంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి సీతాకుమారి
పిన్ కోడ్ 522 262
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం బొర్రావారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-23,24 తేదీలలో (శ్రావణమాసం) శని, ఆదివారాలలో, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తప్పెట్లతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ వీధులలో ఊరేగించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామస్థులు మొక్కుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [1]

ప్రముఖులుసవరించు

కేసన సింధుప్రభసవరించు

కేసనపాలెం గ్రామానికి చెందిన శ్రీ కోటేశ్వరరావు, పద్మశ్రీ దంపతులు చెరుకుపల్లె గ్రామంలో స్థిరపడినారు. ఇద్దరూ విద్యావంతులు. శ్రీ కోటేశ్వరరావు, కావూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె సింధుప్రభ, 8వ తరగతి వరకు కావూరు ప్రభుత్వ పాఠశాలలలోనే విద్యనభ్యసించింది. ఈమె చిన్నప్పటినుండి అన్ని తరగతులలోనూ మొదటి స్థానంలోనే ఉత్తీర్ణురాలవుతూ వచ్చింది. గుంటూరులోని ఆర్.వి.ఆర్ & జె.సి.ఇంజనీరింగ్ కళాశాలలో చదివి 92& మార్కులతో ఔత్తీర్ణురాలై, అచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రథమురాలిగా నిలిచి, స్వర్ణపతకం అందుకున్నది.

అనంతరం "గేట్" పరీక్షలో 1700 ర్యాంక్ సాధించిన ఈమె, ప్రస్తుతం, కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ నగరం సమీపంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.టెక్., చదువుచున్నది. మానవ సహాయం లేకుండా, విద్యుత్తు పరికరాలతో, సమయానికి మంచంలో ఉన్న రోగికి ఔషధాలను అందించే ప్రాజెక్టును, ప్రపంచ సాంకేతిక పరికరాల ఉత్పత్తిదారుల సమాఖ్యకు నామినేషన్ పంపినది. 2015, అక్టోబరు-2న ఈమె దరఖస్తును స్వీకరించిన ఆ అంతర్జాతీయసంస్థ భారతదేశ ప్రతినిధులు, ఆ ప్రాజెక్టును పరిశీలించి, మనదేశం తరఫున ఆ ప్రాజెక్టును అంతర్జాతీయ పోటీలకు నామినేషన్ పంపినది. అంతర్జాతీయ ప్రతినిధులు ఆ ప్రాజెక్టును అమోదించి, విచారణ నిర్వహించారు. 2015, నవంబరు-1 నుండి 4 వరకు, చైనాలో నిర్వహించిన ఐ.ఈ.ఈ.ఈ, రీజియన్-10 సదస్సులో, ఈ ప్రాజెక్టును గురించి, ప్రొఫెసర్ పాల్.జేసెఫ్.క్ తో కలిసి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విని, ఈమెను యువశాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికచేసారు. 2015, నవంబరు-5న ఛైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈమెకు నగదు, ప్రశంసాపత్రం అందజేసినారు. [2]

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.