కే.ఈరన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కే.ఈరన్న

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2018
నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1959
అమరాపురం, అమరాపురం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మల్లప్ప
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

కే.ఈరన్న 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

కే.ఈరన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఓడిపోయిన అభ్యర్థి ఎం. తిప్పేస్వామి ఆయన ఎన్నికను సవాలు చేస్తూ 2014 ఏప్రిల్‌లో ఎన్నికల ట్రైబ్యునల్‌/ హైకోర్టులో ఈపీ దాఖలు చేశాడు. ఈరన్న తన అఫిడవిట్‌లో భార్య ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయాన్ని, కేసు నమోదు వివరాల్ని పేర్కొనలేదని తిప్పేస్వామి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి తనపై నమోదైన కేసుల వివరాల్ని స్వచ్ఛందంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తిప్పేస్వామి వాదనలు విన్న హైకోర్టు ఈరన్నను అనర్హుడిగా ప్రకటించడంతో ఆయన 2018లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[2] కే.ఈరన్న 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. The Hans India (14 December 2018). "TDP MLA Eranna resigns after Supreme Court disqualifies him" (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కే.ఈరన్న&oldid=3575059" నుండి వెలికితీశారు