ఎం. తిప్పేస్వామి

మోపురగుండు తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఎం. తిప్పేస్వామి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 జూన్ 1953
ఉదుగూరు గ్రామం
అమరాపురం మండలం
కడప జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఎం. హనుమప్ప (తండ్రి)
జీవిత భాగస్వామి ఏ.ఎస్‌.సత్యవాణి
సంతానం డా. స్వామి దినేష్, స్వామి మహేష్, స్వామి రాజేష్‌

జననం, విద్యాభాస్యంసవరించు

ఎం. తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, అమరాపురం మండలం, ఉదుగూరు గ్రామంలో 1953 జూన్ 01లో జన్మించాడు. ఆయన 1978లో కర్నూలు మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్, 1981లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా మెడికల్ కాలేజీ నుండి ఎండీ, డీజీఓ పూర్తి చేసి కొంతకాలం వైద్యుడిగా పనిచేశాడు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేశాడు. ఆయన పాండిచ్చేరిలో వైద్య ఆరోగ్యశాఖలో, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా, పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో, వాయల్పాడు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేశాడు.[2]

రాజకీయ జీవితంసవరించు

ఎం. తిప్పేస్వామి 1994లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1999లో పలమనేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో ఓటమిపాలయ్యాడు, 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.

ఎం. తిప్పేస్వామి 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినా హైకోర్టు తీర్పుతో 2018లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

మూలాలుసవరించు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (20 December 2018). "ఉద్యోగం వీడి..ప్రజాసేవలోకి." Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.