కొండపాక మండలం
కొండపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. కొండపాక ఈ మండలానికి కేంద్రం.
కొండపాక మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°58′23″N 78°51′30″E / 17.972957°N 78.858426°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | కొండపాక |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 48,592 |
- పురుషులు | 24,216 |
- స్త్రీలు | 24,376 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.59% |
- పురుషులు | 60.29% |
- స్త్రీలు | 32.75% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 48,592, పురుషులు 24,216, స్త్రీలు 24,376. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 228 చ.కి.మీ. కాగా, జనాభా 48,592. జనాభాలో పురుషులు 24,216 కాగా, స్త్రీల సంఖ్య 24,376. మండలంలో 10,922 గృహాలున్నాయి.[3]
కొండపాక రుద్రేశ్వరాలయం
మార్చుదాదాపు 900 సం.ల. క్రితం కొండపాకలో నిర్మితమైన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైందిగా పేర్గాంచింది. సా.శ.1094వ సంవత్సరంలో మొదటి కాకతీయ రుద్రదేవుడు, తన పరిపాలనాకాలంలో,కాకతీయ సామ్రాజ్యం నలుదిశలా రుద్రేశ్వరస్వామికి పలు ఆలయాలను నిర్మింపజేశాడు. ఆ పరంపరలోనిదే ఈ కొండపాక రుద్రేశ్వరాలయం.[4] 14, 15, 2006 అక్టోబరు 16లో స్థానిక రుద్రేశ్వరాలయ ప్రాంగణంలోనే బ్రహ్మశ్రీ శ్రీరామ సిద్ధాంతిగారి శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ ఈనాడు మెదక్, 14 అక్టోబరు 2013. 9వ పేజీ