కొండవీటి జ్యోతిర్మయి
కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య కీర్తనల గాయని, సంగీత విద్వాంసురాలు, సంఘ సేవకురాలు.[1][2] బ్రైలీ లిపిలో బైబిల్, ఖురాన్, గీత లాంటి గ్రంథాలను ముద్రంచి లిమ్కా, గిన్నిస్ పుస్తకాలలో రికార్డు నెలకొల్పారు.
కొండవీటి జ్యోతిర్మయి | |
---|---|
![]() | |
జననం | 1973 జనవరి 14 |
విద్య | తత్వశాస్త్రం, , కర్ణాటక సంగీతం లో ఎం. ఎ |
వృత్తి | గాయని |
వ్యక్తిగత జీవితంసవరించు
జ్యోతిర్మయి 1973, జనవరి 14 న జన్మించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాల నుంచి తత్వశాస్త్రం, కర్ణాటక సంగీతంలో స్నాతకోత్తర విద్యనభ్యసించింది. ఇందిరా దేవి, పుదుకోట్టై రామనాథన్, మైథిలి, నూకల చిన్నసత్యనారాయణ దగ్గర సంగీతాన్ని అభ్యసించింది. ఎక్కిరాల కృష్ణమాచార్యను తన ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకుంది.
భావాలుసవరించు
ఆది కమ్యూనిస్టు అన్నమయ్యే. తొలి సామాజిక భావ విప్లవవాది.భక్తి, కమ్యూనిజం సిద్ధాంతాలు ఏవైనా అందరూ హ్యూమనిస్టులే. మనకు లభించిన 32 వేల కీర్తనల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించేవే ఎక్కువ. అయితే భక్తిభావంతో వాటిని గుర్తించలేక పోతున్నాం. తందనాన... పాటలో రాజు, బంటు ఒకటేనన్నారు.. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి. ప్రజానాట్య మండలికి వేలాది కార్యకర్తల దళం ఉంది. వారి ద్వారా పల్లె పల్లెకు అన్నమయ్య కీర్తనలు వెళ్లాలనే నా ఉద్దేశం. సంకీర్తన-సత్కర్మ అనే రెండు లక్షణాల్ని అందుకుంటే దాని నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకదానితో ఒకటి అనుసంధానమై ఆత్మ చైతన్యం వెల్లివిరుస్తుంది. ఆంగ్ల భాష మనల్ని చుట్టుముడుతోంది. తెలుగు వెలుగొందాలంటే చిన్నారులనే ఆయుధంగా మార్చాలి. వేమన, సుమతి, దాశరథి పద్యాలతోపాటు అన్నమయ్య పాటలు నేర్పండి. ఆధ్యాత్మికత, మతం వేరు వేరు. ఒక దానికి ఒకటి సంబంధం లేదు. మహిళలలు సయితం వేదాలు చదవాలని చైతన్యం తీసుకు వచ్చిన మహనీయుడు అన్నమాచార్యులు.
మూలాలుసవరించు
- ↑ "నన్ను ఆయన నాన్నా అంటారు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 14 February 2018.[permanent dead link]
- ↑ "కొండవీటి.ఆర్గ్". kondaveeti.org. Archived from the original on 8 November 2011. Retrieved 14 February 2018.