నూకల చినసత్యనారాయణ

నూకల చినసత్యనారాయణ ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక సంగీత విద్వాంసుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. సాధనలో బోధనలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.[1] ఆయన స్వస్థలం విశాఖ జిల్లా అనకాపల్లి. 1927 ఆగస్టు 4న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు యజ్ఞ చయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మలు. బాల్యం నుంచీ ఆయన గాత్ర సంగీతమంటే మంచి ఆసక్తి చూపించేవాడు. అలాగే స్టేజి నాటకాలన్నా చెవికోసుకునేవాడు. పదేళ్ళ వయసులో మొదటి సారిగా బాలకృష్ణుడిగా రంగస్థల నటుడి అవతారమెత్తాడు.

నూకల చినసత్యనారాయణ
Nookala.jpg
వ్యక్తిగత సమాచారం
జననం(1923-08-04)1923 ఆగస్టు 4
మూలంఅనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్,
మరణం2013 జూలై 11(2013-07-11) (వయస్సు 89)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిసాంప్రదాయ సంగీత కారుడు
క్రియాశీల కాలం1945 - 2013
వెబ్‌సైటుఅధికారిక వెబ్ సైటు

వీణా విద్వాంసుడు కంభంపాటి అక్కాజీ రావు ఆయన తొలిగురువు. ఆయన దగ్గర కొంత కాలం పాటు వయొలిన్ విద్యనభ్యసించాడు. తరువాత మంగళంపల్లి పట్టాభిరామయ్య దగ్గర కొంతకాలం బెజవాడలో శిష్యరికం చేశాడు. తరువాత విజయనగరం సంగీత కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర శిష్యరికం చేశాడు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గురుత్వంలో ఆయన జీవితం మేలి మలుపు తిరిగింది.

లండన్ మేయర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడాడు. అమెరికా ఆహ్వానం మేరకు అక్కడా తల గళాన్ని వినిపించాడు. ప్రతిష్ఠాత్మకమైన మద్రాసు సంగీత పీఠం నుంచి సంగీతాచార్యుడిగా గుర్తింపు పొందాడు. కేంద్ర సంగీత నాటక పురస్కారాన్నీ అందుకున్నాడు. రాగలక్షణ సంగ్రహం అనే పుస్తకాన్ని రచించాడు. మూడు వందలకుపైగా కర్ణాటక, హిందుస్థానీ రాగాల అనుపానులు విపులీకరించారు. పంచరత్న కీర్తనలను మోనోగ్రాఫ్ మీద వెలువరించారు. రాష్ట్రం లోని పలు సంగీత కళాశాలల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.[2]

కుటుంబంసవరించు

ఆయనకు శ్రీమతి అన్నపూర్ణ, ఆయ్యలసోమయాజుల కామేశ్వరరావుల కూతురైన శేషతో వివాహమైంది. వీరికి ఏడు మంది సంతానం. సికింద్రాబాద్ లో ఉండే వీళ్ళ ఇల్లు ఎప్పుడూ వచ్చీ పోయే బంధువులతో, అతిథులతో, విద్యార్థులతో కళకళలాడుతూ ఉంటుంది.

మూలాలుసవరించు

  1. http://www.thehindu.com/arts/music/article566434.ece
  2. ఫిబ్రవరి 21, 2010 సాక్షి ఫన్ డే కోసం చింతకింది శ్రీనివాస రావు రాసిన శీర్షిక ఆధారంగా...

ఇతర లింకులుసవరించు