కొండా
కొండా 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖల జీవితకథ ఆధారంగా శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఏ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. అదిత్ అరుణ్, ఇర్రా మోర్, పృథ్వీరాజ్, శ్రవణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ 2022 జనవరి 26న 10గంటల 25 నిముషాలకి విడుదల చేసి[2] సినిమాను జూన్ 23న విడుదల చేశారు.[3]
కొండా | |
---|---|
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
కథ | రామ్ గోపాల్ వర్మ |
దీనిపై ఆధారితం | కొండా మురళి, కొండా సురేఖల జీవితకథ ఆధారంగా[1] |
నిర్మాత | సుష్మితా పటేల్ |
తారాగణం |
|
Narrated by | రామ్ గోపాల్ వర్మ |
ఛాయాగ్రహణం | మల్హర్బట్ జోషి |
కూర్పు | మనీష్ ఠాకూర్ |
సంగీతం | డి.ఎస్.ఆర్ |
నిర్మాణ సంస్థ | ఏ కంపెనీ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 2022 జూన్ 23 |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చు‘కొండా’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు అధికారికంగా 26 సెప్టెంబర్ 2021న ప్రకటించి[4], సినిమాకి సంబంధించిన పోస్టర్స్ 4 అక్టోబర్ 2021న విడుదల చేసి,[5] షూటింగ్ ను అక్టోబర్ 12న కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరిలో ప్రారంభమైంది.[6][7]ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో వరంగల్ లో షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా ముగింపు వేడుక నిర్వహించారు.[8]
నటీనటులు
మార్చు- అదిత్ అరుణ్
- ఇర్రా మోర్[9]
- పృథ్వీరాజ్
- ఎల్. బి. శ్రీరామ్
- తులసి
- శ్రవణ్
- జబర్దస్త్ రామ్ ప్రసాద్
- మల్లెడి రవికుమార్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఏ కంపెనీ ప్రొడక్షన్
- నిర్మాత: సుష్మితా పటేల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
- సంగీతం: డి.ఎస్.ఆర్
- సినిమాటోగ్రఫీ: మల్హర్బట్ జోషి
- బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: ఆనంద్
- ఎడిటర్: మనీష్ ఠాకూర్
- మాటలు: భరత్ కుమార్
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (24 September 2021). "కొండా మురళిపై వర్మ బయోపిక్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (26 January 2022). "నిప్పుల'కొండా'మురళి". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Andhra Jyothy (23 June 2022). "సినిమా రివ్యూ : 'కొండా'". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
- ↑ NTV (26 September 2021). "ఆర్జీవీ సంచలనం.. 'కొండా' సినిమా అనౌన్స్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ TV9 Telugu, TV9 Telugu (4 October 2021). "'కొండా' మూవీ పోస్టర్స్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Dishadaily (దిశ) (12 October 2021). "కొండా దంపతుల సమక్షంలో 'కొండా' షూటింగ్ షురూ". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ TV5 News (12 October 2021). "అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు తీసుకున్న డైరెక్టర్ వర్మ" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (26 December 2021). "తల్వార్‌తో రామ్‌గోపాల్ వర్మ హల్‌చల్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Sakshi (16 June 2022). "ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం : హీరోయిన్". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.