కొండా సురేఖ
కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.[1][2][3]
కొండా సురేఖ | |||
| |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 7 నుండి ప్రస్తుతం | |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 3 నుండి ప్రస్తుతం | |||
నియోజకవర్గం | తూర్పు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 19 ఆగస్టు 1965 ఊకల్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | టీఆర్ఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | వంచనగిరి |
జీవిత విశేషాలు
మార్చుఆమె వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఊకల్ లో 19 ఆగస్టు 1964 తుమ్మ చంద్రమౌళి, రాద దంపతులకు జన్మించారు. పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదివారు.
రాజకీయ జీవితం
మార్చుకొండా సురేఖ 1995లో కాంగ్రెస్ తరఫున వంచనగిరి ఎంపీటీసీగా గెలిచి గీసుగొండ మండల ఎంపీపీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది. 1996లో ఆమె ఆంధ్రప్రదేశ్ పి.సి.సి సభ్యురాలిగా నియమింపబడ్డారు. కొండా సురేఖ 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో శాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శిగా, మహిళ, శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగానూ, ఆరోగ్య, ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా పని చేసి 2000లో ఏఐసీసీ కో ఆప్షన్ సభ్యురాలిగా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా నియమితురాలైంది.
కొండా సురేఖ 2004లో శాయంపేట శాసనసభ్యురాలిగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైనారు. ఆమె 2005లో మున్సిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీసియో సభ్యురాలిగా ఉన్నారు. కొండా సురేఖ 2009లో పరకాల శాసనసభ నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పని చేసింది.[4] రాజశేఖరరెడ్డి మరణం తరువాత అతని కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారీటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం యివ్వనందున మంత్రి పదవికి రాజీనామా చేసింది.[5][6]
జగన్మోహనరెడ్డి కారణంగా, రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చడం మూలంగా ఆమె జూలై 4 2011 న తన శాసనసభ్య సభ్యత్వానికి రాజీనామా చేసి[7] 2012 జూన్ 12న జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయింది.
2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించి 2013 జూలై 13న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికై[8] 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి తిరిగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[9]
ఆమె 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో తూర్పు వరంగల్ అభ్యర్థిగా పోటీ చేసి[10][11], గెలిచి [12] డిసెంబర్ 7న దేవాదాయ & అటవీ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి[13] [14][15] డిసెంబర్ 7న సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది.[16]
కొండా సురేఖను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా[17], డిసెంబర్ 24న మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించారు.[18]
2024లో లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమెను మార్చి 31న మెదక్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[19]
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్రసమితి ఎం.ఎల్.సి అయిన కొండా మురళిని వివాహమాడారు.[20] వారికి ఒక కుమార్తె సుస్మిత పటేల్.
మూలాలు
మార్చు- ↑ "Konda Surekha Profile". Archived from the original on 2015-10-04. Retrieved 2015-09-23.
- ↑ PTI (2011-07-04). "Telangana issue: Jagan loyalist MLA quits". The Hindu. Retrieved 2013-07-19.
- ↑ Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ "Surekha gives a setback to Rosaiah leadership in Andhra Pradesh with resignation". Sify.com. 2009-10-30. Archived from the original on 2012-10-05. Retrieved 2013-07-19.
- ↑ "Andhra minister's resignation accepted". Sify.com. 2009-10-30. Archived from the original on 2012-10-21. Retrieved 2013-07-19.
- ↑ Menon, Amarnath K. and Priya Sahgal "Why Sonia fears Jagan?" India Today November 26, 2010
- ↑ "Cong says it's not opposed to Telangana". Hindustan Times. Archived from the original on 2013-01-25. Retrieved 2013-07-19.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ BBC News తెలుగు (26 November 2018). "సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?". BBC News తెలుగు. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
- ↑ Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (28 October 2023). "హస్తం.. అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్ క్యాబినెట్". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "రుద్రమలై కదలాలి.. ఓరుగల్లు మురవాలి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (17 December 2023). "అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ." Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ Sakshi (24 December 2023). "TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Andhrajyothy (31 March 2024). "లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్‌కు ఎవరంటే." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ "Konda couple joins TRS". The Hindu.