కొండిపర్తి పున్నయ్య

కొండిపర్తి పున్నయ్య దేశభక్తుడు, జాతీయోద్యమంలో పాల్గొన్న కార్యకర్త, సంఘసంస్కర్త. ఇతను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఆంధ్ర జాతీయ కళాశాలలో విద్యాభాసం చేశాడు. మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ పాల్గొన్నాడు.ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించాడు.

పున్నయ్య బులుసు సాంబమూర్తి వలె కొల్లాయి కట్టి, పైన అంగవస్త్రం వేసుకొనేవాడు.

మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావుతో, టంగుటూరు ప్రకాశం పంతులుతోను అక్కడి ఖాదీభందార్ లో ఖద్దరు వస్త్రవిక్రయం వంటివి పర్యవేక్షించాడు.

నెల్లూరులో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం స్థాపకులు నలుగురిలో ఒకడు. ఆశ్రమం యావజ్జీవిత సభ్యుడు. పున్నయ్య నాస్తికుడు. శరీరశ్రమలో ఆధ్యాత్మికత ఉందని విశ్వసించాడు. దాదాపు పదేళ్ళు ఆశ్రమంలో ఉన్నాడు.దిగుమర్తి హనుమంతరావు చనిపోవడంతో ఆశ్రమ వాసులందరూ చెల్లాచెదరయి యవరిదారిన వారు వెళ్ళారు. పున్నయ్య మద్రాసు వెళ్లి ఖద్దరు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కృష్ణా జిల్లాలో సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడని, వితంతు వివాహాలు చేసాడని పత్రికల రాతలవల్ల తెలుస్తుంది. కొండిపర్తి పున్నయ్య స్వాతంత్ర్యోద్యమంలో జైలుకు కూడా వెళ్ళాడు.


పున్నయ్య 50 వ ఏట ప్రకాశం పంతులుగారి అన్న కుమార్తె - ఒక వితంతువును పెళ్లి చేసుకొని, బందరులో స్థిరపడి అక్కాడే చనిపోయాడు.

ఆకరాలు

మార్చు
  • రాపాక ఏకామ్బరాచారి "విశ్వబ్రాహ్మణ ప్రముఖులు"
  • డాక్టర్ కాళిదాసు పురుషోత్తం సేకరించిన సమాచారం
  • పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ట్రస్ట్ పత్రం
  • ఖాసా సుబ్బారావు రచనలు