కొత్త కాపురం
1975లో విడుదలైన తెలుగు సినిమా.
(కొత్తకాపురం నుండి దారిమార్పు చెందింది)
కొత్త కాపురం పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1975లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, భారతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను జి. వెంకటరత్నం ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు.[1] పల్లెటూరి వాతావరణాన్ని, పల్లె ప్రజల జీవన విధానాన్ని, వారి కుటుంబాల్ని, అందులోని తగదాల్ని ప్రధానంగా ఆవిష్కరించిందీచిత్రం.
కొత్త కాపురం | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
నిర్మాత | జి. వెంకటరత్నం |
తారాగణం | కృష్ణ, భారతి |
సంగీతం | కె. వి. మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఏప్రిల్ 18, 1975 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: పి.చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాత: జి.వెంకటరత్నం
నిర్మాణ సంస్థ:ప్రసన్నలక్ష్మి పిక్చర్స్
సాహిత్యం:కొసరాజు,దాశరథి, సి. నారాయణ రెడ్డి, మోదుకూరి జాన్సన్
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
విడుదల:18:08:1975 .
నిర్మాణం
మార్చుదర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[3]
పాటలు
మార్చుఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు.[4]
- కాపురం కొత్త కాపురం - ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ముంతంత కొప్పులో మూడు సేమంతి పూలు , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
- కాడి జోడెడ్ల అవడా కరుకైన కుర్రవాడా , రచన: మోదుకూరి జాన్సన్, గానం. పులపాక సుశీల
- దంచుకో నాయనా ధనియాల పప్పు , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఓ రంగుల రామచిలుక ఇటురావే బంగారు , రచన:కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
మూలాలు
మార్చు- ↑ "కృష్ణ 'కొత్త కాపురం' చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి". Retrieved 2020-07-26.
- ↑ Chauhan, Ramesh (2016-11-23). "అభినవ భారతి..." Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 2020-07-27. Retrieved 2020-07-26.
- ↑ "నువ్వు పొట్టిగా వున్నావ్ .. యాక్టర్ ఎలా అవుతావ్ అన్నాడాయన: దర్శకుడు పీఎన్ రామచంద్రరావు ." ap7am.com. Archived from the original on 2020-07-26. Retrieved 2020-07-26.
- ↑ ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews:". rajamusicbank.com. Retrieved 2020-07-26.