పి.ఎన్.రామచంద్రరావు

పి.ఎన్.రామచంద్రరావు ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, సినీరచయిత. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ చలనచిత్ర రంగాలలో పనిచేశాడు. [1][2][3]

పి.ఎన్.రామచంద్రరావు
జననం18 ఆగష్టు 1955
చదలవాడ, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత, సినిమా రచయిత
క్రియాశీల సంవత్సరాలు1980 - ప్రస్తుతం

ఇతడు చదలవాడ గ్రామంలో జన్మించినప్పటికీ ఇతని బాల్యమంతా నెల్లూరు జిల్లా పార్లపల్లెలో గడిచింది. 1973లో మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నడుపుతన్న ఫిల్మ్‌ ఇన్స్‌టిట్యూట్‌లో నటనలో శిక్షణ కొరకు ఒక ప్రకటన వెలువడింది. 18 యేళ్ళ రామచంద్రరావు ఆ కోర్సులో చేరడానికి మద్రాసు వెళ్ళాడు. అయితే ఆ కోర్సులో చేరడానికి కనీస వయసు 21 సంవత్సరాలు కాబట్టి అతడికి ఆ కోర్సులో ప్రవేశం లభించలేదు. ఒంటరిగా ఏడుస్తున్న రామచంద్రరావును చూసి సీనియర్ నిర్మాత డూండీ ఇతడిని పలకరించి విషయం తెలుసుకుని నెల్లూరుకు చెందిన దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డిని కలవమని సలహా ఇచ్చాడు. డూండీ సలహా ప్రకారం ఇతడు పి.చంద్రశేఖరరెడ్డిని కలుసుకుని అతని వద్ద కొత్త కాపురం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.

వృత్తి

మార్చు

పి.ఎన్.రామచంద్రరావు గిరిబాబు నిర్మించిన సంధ్యారాగం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. 1983లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మెరుపు దాడి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. 1987లో ఇతడు తన స్నేహితులను భాగస్వాములుగా చేసుకుని నిర్మాతగా మారి గాంధీనగర్ రెండవ వీధి సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఇదే కాకుండా చిత్రం భళారే విచిత్రం వంటి విజయవంతమైన 12 సినిమాలను ఇప్పటివరకూ నిర్మించాడు. [4]

సినిమాల జాబితా

మార్చు

ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం సినిమా పేరు నటీనటులు విశేషాలు
1981 సంధ్యారాగం గిరిబాబు, శరత్ బాబు, ప్రభ మొదటి సినిమా
1984 మెరుపు దాడి భానుచందర్, సుమలత, గిరిబాబు
1985 యముడు భానుచందర్, అశ్వని అశ్వని మొదటి సినిమా
1985 వస్తాద్ భానుచందర్, తులసి నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మొదటి సినిమా
1986 కోటిగాడు అర్జున్, శరత్ బాబు, రాధిక
1986 ప్రైవేట్ మాస్టర్
1986 భయం భయం
1987 గాంధీనగర్ రెండవ వీధి రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, గౌతమి * గౌతమి మొదటి తెలుగు సినిమా.
* సంగీత దర్శకుడిగా జి.ఆనంద్ మొదటి సినిమా.
1988 ఆగష్టు 15 రాత్రి అర్జున్, గౌతమి, శరత్ బాబు
1988 డాక్టర్ గారి అబ్బాయి అర్జున్, ఆశారాణి, శివకృష్ణ
1989 శక్తి
1989 సాక్షి రఘువరన్, జయసుధ, నిర్మల లిజి నటించిన తొలి తెలుగు సినిమా
1990 మాస్టారి కాపురం రాజేంద్రప్రసాద్, గాయత్రి ఈ సినిమాకి ఉత్తమ సహాయనటి, ఉత్తమ సంభాషణల రచయిత విభాగాలలో రెండు నంది పురస్కారాలు లభించాయి
1991 ఇంట్లో పిల్లి వీధిలో పులి చంద్రమోహన్, సురేష్, యమున
1991 చిత్రం భళారే విచిత్రం నరేష్, శుభలేఖ సుధాకర్, రాజీవి ఈ సినిమాద్వారా నటిగా రాజీవి పరిచయమయింది. ఉత్తమ మేకప్ విభాగంలో నంది పురస్కారం లభించింది.
1992 పెళ్ళినీకు శుభం నాకు నరేష్, దివ్యవాణి
1993 అత్తకు కొడుకు మామకు అల్లుడు వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి
1993 అసలే పెళ్ళైనవాణ్ణి నరేష్, సౌందర్య
1993 మనవరాలి పెళ్ళి హరీష్, సౌందర్య
1994 తెగింపు భానుచందర్ బి.జె.పికి చెందిన రాజకీయనాయకుడు ఎ.నరేంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. మరో రాజకీయ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడు.
1995 లీడర్ కృష్ణంరాజు, సుమన్, ప్రియ రామన్
1996 సహనం ఆనంద్, ఊహ, ప్రకాష్ రాజ్ శ్రీలక్ష్మికి ఉత్తమ హాస్యనటిగా నందిపురస్కారం దక్కింది.
1998 శుభవార్త అర్జున్, సౌందర్య
1999 మహిళ ద్విభాషాచిత్రం (తెలుగు,కన్నడ)
2003 గోల్‌మాల్ జె.డి.చక్రవర్తి, నేహా పెండ్సే బయాస్, మీరా వాసుదేవన్ మీరా వాసుదేవన్ తొలి సినిమా
టెలివిజన్ సీరియళ్ళు
  • "భక్త మార్కాండేయ" (2000) (ఈటీవిలో ప్రసారం)

మూలాలు

మార్చు
  1. "Ramachandra Rao P.N."
  2. YouTube. YouTube.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-05. Retrieved 2022-11-16.
  4. "Rediff on the NeT, Movies: Gossip from the southern film industry".

బయటి లింకులు

మార్చు