రమాప్రభ

సినీ నటి

రమాప్రభ (జ: మే 5[2], 1946) తెలుగు సినిమా నటి. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది.

రమాప్రభ
Rama Prabha.jpg
జననం(1946-05-05)1946 మే 5
వాయల్పాడు, చిత్తూరు జిల్లా[1]
వృత్తినటి
జీవిత భాగస్వామిశరత్ బాబు (విడాకులు)

చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి (దీని పాతపేరు వాయల్పాడు) చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది. తండ్రి కృష్ణదాస్‌ ముఖర్జీ గూడూరులో మైకా వ్యాపారం చేశారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. ప్రముఖ నటుడు శరత్‌ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. సినిమాల్లోకి రాకముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు.

బాల్యంసవరించు

రమాప్రభ 1946, మే 5 [2]అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించింది. రమాప్రభ కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా పుట్టింది. ఆమె పుట్టే నాటికి ఆమె మేనత్త, మేనమామలకు పిల్లలు లేరు. రమాప్రభ నెలరోజుల పసికందుగా ఉన్నప్పుడు మాకిచ్చేయరాదా పెంచుకుంటాము అని మేనత్త మేనమామ అడగగా, తల్లిదండ్రులు దత్తత ఇచ్చేశారు. మేనమామ కృష్ణదాస్‌ ముఖర్జీ అబ్రకం గనుల్లో పని చేసేవాడు. రమాప్రభ బాల్యం కదిరిలో కొంతకాలం ఆ తర్వాత ఊటి సమీపంలోని లోయలో సాగింది. ఒక్కగానొక్క పెంపుడు కూతురు కాబట్టి తనను గారాభంగా పెంచారు. కానీ రమాప్రభకు పన్నెండేళ్లు వచ్చేసరికి పెంపుడుతండ్రి చనిపోయాడు. వ్యవసాయ కూలీ అయిన సొంత తండ్రి పదమూడు మంది సంతానంతో వారిని సాకలేక సతమతమవుతూ, కూలీ పని లేనప్పుడు ఇంట్లో గాజుల మలారం పెట్టుకొని గాజులు అమ్మేవాడు. అలాంటి పరిస్థితుల్లో రమాప్రభ, పన్నెండేళ్ల వయసులో మేనత్త రాజమ్మతో కలిసి మద్రాసు చేరుకుంది. చదువు లేక, డబ్బు లేక, తినటానికి తిండి లేక వీధుల వెంట పనికోసం తిరిగారు.

హాస్య భావాలుసవరించు

  • పుస్తకం పట్టకుండానే సినీనటినయ్యాను. ఒకటో తరగతి చదివేందుకు కూడా పాఠశాలకు వెళ్లలేదు. చదవకుండా ఉంటే సినీ నటులవుతారు.

నటించిన సినిమాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. వాశిరాజు, ప్రకాశం. "రమాప్రభను సినీరంగం మరిచిపోయిందా?". వార్త. Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 15 April 2018.
  2. 2.0 2.1 పుట్టినరోజు వివరాలు ఐఎండీబీ నుండి
  3. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.

బయటి లింకులుసవరించు

[1]


[2]

"https://te.wikipedia.org/w/index.php?title=రమాప్రభ&oldid=3786277" నుండి వెలికితీశారు