కొత్తపల్లి గీత

16వ భారత లోక్ సభ సభ్యురాలు. అరకు నియోజకవర్గం నుండి ఎంపీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ నాయకురాలు, సంఘ సేవకురాలు. ఆంధ్రప్రదేశ్ లోని అరకు (లోక్‌సభ నియోజకవర్గం) మాజీ పార్లమెంటు సభ్యురాలు. ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుండి గెలిచారు.[2] 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

కొత్తపల్లి గీత
పార్లమెంటు సభ్యులు, అరకు లోక్‌సభ నియోజకవర్గం
In office
16 మే 2014 – 23 మే 2019
అంతకు ముందు వారుకిషోర్ చంద్ర దేవ్
తరువాత వారుగొద్దేటి మాధవి
నియోజకవర్గంఅరకు లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1971-02-04) 1971 ఫిబ్రవరి 4 (వయసు 53)
తిమ్మాపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ [1]
ఇతర రాజకీయ
పదవులు
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ (2019 కి ముందు), స్వతంత్ర
జీవిత భాగస్వామిపరుచూరి రామ కోటేశ్వరరావు
సంతానంఅభినయ్ తేజ్ పరుచూరి , అన్విత పరుచూరి
నివాసంహైదరాబాదు, న్యూఢిల్లీ
చదువుబి.ఎ (1989), బి.ఇ.డి (1990),ఎం.ఎ (సైకాలజీ)(1993), ఎం.ఎ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) (1995), ఎం.ఎ (సోషియాలజీ) (1997)
As of 19 October, 2015

నిర్వహించిన పదవులు

మార్చు
  • మే 2014 : 16వ లోక్‌సభకు ఎన్నిక
  • 1 సెప్టెంబరు. 2014 నుండి : సభ్యురాలు, మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ.[2]
  • సభ్యురాలు, గృహ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ
  • సభ్యురాలు, కాఫీ బోర్డు
  • సభ్యురాలు, APEDA
  • సభ్యురాలు, రైల్వే కన్వెన్షియల్ కమిటీ
  • చైర్మన్ , DISHA విశాఖపట్నం
  • సహ చైర్మన్, DISHA తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం

ప్రారంభ జీవితం

మార్చు

కొత్తపల్లి గీత 1971 లో విద్యావంతులైన కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులకు ఏకైక ఆడపిల్ల. ఆమె తండ్రి కొత్తపల్లి జాకబ్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అడ్డతీగల మండలానికి చెందిన తిమ్మాపురం గ్రామానికి చెందిన షెడ్యూల్డ్ తెగ విభాగం వాల్మీకి వర్గానికి చెందినవాడు. తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజన వర్గం నుండి ఆమె మొదటి గ్రాడ్యుయేట్.

విద్య

మార్చు

గీత 1989 లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1990 లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసింది. ఆమె 20 సంవత్సరాల వయస్సులో ఉద్యోగం పొందింది. ఆమె చాలా పోటీ పరీక్షలలో అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆమె తన విద్యాభ్యసనను కొనసాగించింది. 1993లో ఆమె సైకాలజీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, 1995 లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ను, 1997లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సోషియాలజీ ని చేయడాం ద్వారా విద్య, సామాజిక సేవ, రాజకీయ వృత్తిపై తన ఆసక్తిని కొనసాగించింది,

వృత్తి జీవితం

మార్చు

గీతా 20 సంవత్సరాల వయసులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (గోదావరి గ్రామీణ బ్యాంక్) లో ఆఫీసర్‌గా తన వృత్తిని ప్రారంభించి 1991 ఫిబ్రవరి లో సర్వీసులో చేరింది. ఆమె ఆఫీసర్‌గా 2 సంవత్సరాలు, మేనేజర్‌గా 4 సంవత్సరాలు బ్యాంకుకు సేవలందించి బ్యాంకింగ్, పరిపాలనా రంగాలలో జ్ఞానం సంపాదించింది. గీత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రూప్ 1 సేవలకు హాజరయింది. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యింది. 1999 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో చేరింది. ఆమె ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా చేరింది. సబ్-కలెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్), రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్వేలో స్పెషల్ ఆఫీసర్, ల్యాండ్ రికార్డులు మొదలైన పదవులలో పనిచేసింది. పరిపాలనా, చట్టం, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, విధానాలలో విస్తృత జ్ఞానాన్ని పొందింది.

వ్యాపారం

మార్చు

గీతా రాష్ట్ర ప్రభుత్వ సేవలకు రాజీనామా చేసి, మార్చి 2010 లో రిలీవ్ అయింది. చెన్నైలో ఉన్న ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడింగ్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌లో వ్యాపారం ఉన్న మహేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో వివిధ బోర్డుల డైరెక్టర్‌గా తన వ్యాపార వృత్తిని ప్రారంభించింది. కంపెనీ పరిపాలన, రోజువారీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించింది. అద్భుతమైన విద్యా నేపథ్యంతో, గీతా చాలా చురుకైనది. గ్రూప్ కంపెనీల పరిపాలన, వ్యాపారం యొక్క అన్ని కార్యకలాపాల్లో పాల్గొనేది.


మూలాలు

మార్చు
  1. https://twitter.com/Geethak_MP/status/1140926221166899200
  2. 2.0 2.1 "Kothapalli Geetha". Government of India. Retrieved 19 October 2015.

వనరులు

మార్చు