అరకు లోక్‌సభ నియోజకవర్గం
అరకు లోక్‌సభ నియోజకవర్గం, ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని భాగాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.[1] పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉంది.[2] అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1 సెగ్మెంట్ ఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.
అరకు | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | పార్వతీపురం, బొబ్బిలి |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2008 |
ప్రస్తుత పార్టీ | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | కొత్తపల్లి గీత |
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు
- పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
నియోజకవర్గపు గణాంకాలుసవరించు
నియోజకవర్గం నుండి గెలుపొందిన పార్లమెంటు సభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 18 అరకు (ST) కొత్తపల్లి గీత స్త్రీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 413,191 గుమ్మడి సంధ్యా రాణి స్త్రీ తెలుగుదేశం పార్టీ 321,793 2009 18 అరకు (ST) వి.కిశోర్ చంద్రదేవ్ M INC 360458 మిడియం బాబూరావు M CPM 168014
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య, [4] ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం, [5] కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పోటీచేశారు.[6] ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.
2014 ఎన్నికలుసవరించు
ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులుసవరించు
ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు ఆమ్‌ఆద్మీ పార్టీ బి.ధనరాజు కాంగ్రెస్ కిశోరచంద్రదేవ్ తె.దే.పా గుమ్మిడి సంధ్యారాణి సి.పి.యం మిడియం బాబూరావు వై.కా.పా కొత్తపల్లి గీత
ఎన్నికల ఫలితాలుసవరించు
2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
సార్వత్రిక ఎన్నికలు, 2014: అరకు [7] | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
వై.కా.పా | కొత్తపల్లి గీత | 413,191 | 45.42 | N/A | |
తె.దే.పా | గుమ్మిడి సంధ్యారాణి | 321,793 | 35.38 | N/A | |
కాంగ్రెస్ | కిశోర్ చంద్రదేవ్ | 52,884 | 5.81 | -39.68 | |
సిపిఐ(ఎం) | మిడియం బాబూరావు | 38,898 | 4.26 | -16.94 | |
స్వతంత్ర అభ్యర్ది | కంగల బాలుదొర | 23,251 | 2.55 | N/A | |
స్వతంత్ర అభ్యర్ది | చెట్టి శంకరరావు | 8,951 | 0.98 | N/A | |
AAP | బూర్జబారికి ధనరాజు | 8,569 | 0.94 | N/A | |
స్వతంత్ర అభ్యర్ది | సల్లంగి రత్నం | 7,688 | 0.85 | N/A | |
స్వతంత్ర అభ్యర్ది | బిడ్డిక రామయ్య | 7,587 | 0.83 | N/A | |
స్వతంత్ర అభ్యర్ది | ఇల్ల రామిరెడ్డి | 5,692 | 0.63 | N/A | |
స్వతంత్ర అభ్యర్ది | వనుగు శంకరరావు | 4,614 | 0.51 | N/A | |
NOTA | None of the above | 16,532 | 1.82 | N/A | |
మెజారిటీ | 91,398 | 10.04 | -14.25 | ||
మొత్తం పోలైన ఓట్లు | 909,614 | 72.92 | +5.91 | ||
కాంగ్రెస్ పై వై.కా.పా విజయం సాధించింది | ఓట్ల తేడా | +25.58 |
మూలాలుసవరించు
- ↑ సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-06. Retrieved 2009-07-27.
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ [1]