కొత్తపల్లి మండలం (కరీంనగర్)

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం

కొత్తపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం ఏర్పడింది. ఇందులో 12 గ్రామాలున్నాయి. [2][3] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. ఈ మండల కేంద్రం కొత్తపల్లి, ఇదే జిల్లాలోని కరీంనగర్ మండలం, కరీంనగర్ రెవెన్యూ డివిజనులో ఉండేది.

కొత్తపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం కొత్తపల్లి
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 98 km² (37.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,210
 - పురుషులు 25,505
 - స్త్రీలు 25,705.
పిన్‌కోడ్ 505451

2016 లో ఏర్పడిన మండలం మార్చు

లోగడ కొత్తపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో, కరీంనగర్ మండలానికి చెందిన పట్టణ పరిధిలోని ప్రాంతం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తపల్లి (హవేలి) గ్రామాన్ని (1+11) పదకొండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా కరీంనగర్  - జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 98 చ.కి.మీ. కాగా, జనాభా 51,210. జనాభాలో పురుషులు 25,505 కాగా, స్త్రీల సంఖ్య 25,705. మండలంలో 12,837 గృహాలున్నాయి.[4]

మండలం లోని పట్టణాలు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

 1. మల్కాపూర్
 2. కొత్తపల్లి
 3. లక్ష్మీపూర్
 4. సీతారాంపూర్
 5. రేకుర్తి
 6. నాగులమల్లియల్
 7. చింతకుంట
 8. ఖాజీపూర్
 9. ఆసిఫ్‌నగర్
 10. ఎలగందల్
 11. బద్దిపల్లి
 12. కమాన్‌పూర్

మూలాలు మార్చు

 1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
 2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
 3. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
 4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు