కరీంనగర్ రెవెన్యూ డివిజను
కరీంనగర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కరీంనగర్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కరీంనగర్లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
కరీంనగర్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
మార్చుకరీంనగర్ డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | కరీంనగర్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | కరీంనగర్ మండలం | 1 రెవెన్యూ గ్రామం (2 నిర్జన గ్రామాలు) |
2 | కొత్తపల్లి మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
3 | కరీంనగర్ గ్రామీణ మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
4 | మానకొండూరు మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
5 | తిమ్మాపూర్ మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
6 | గన్నేరువరం మండలం | 10 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
7 | గంగాధర మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
8 | రామడుగు మండలం | 18 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
9 | చొప్పదండి మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
10 | చిగురుమామిడి మండలం | 1 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-20.
- ↑ "Administrative Setup | Karimnagar | India". Archived from the original on 2022-01-27. Retrieved 2022-03-20.
- ↑ "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-02-20.