కొత్తసత్రం శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా కావలి మండలానికి చెందిన గ్రామం.

కొత్తసత్రం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొత్తసత్రం is located in Andhra Pradesh
కొత్తసత్రం
కొత్తసత్రం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°54′13″N 80°04′41″E / 14.903523°N 80.078101°E / 14.903523; 80.078101
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కావలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మత్యకార గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో, 10 సంవత్సరముల క్రితం వరకూ 1 నుండి 7వ తరగతి వరకూ, తరగతి గదులు లేవు. ఉన్న గదులలో విద్యార్థులుండేవారు కాదు. ప్రహరీ గోడ లేదు. అందువలన 2005లో, గ్రామస్థులు చందాలు వేసుకొని, రు. 5 లక్షలతో, ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చి, అదనపు తరగతి గదులు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో 9 గదులున్నవి. 10 మంది ఉపాధ్యాయులున్నారు. 220 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్తు ఏర్పాటు చేసుకున్నారు. చదువులలోనూ, ఆటపాటలలోనూ రాణించినవారికి ప్రోత్సాహక బహుమతులిస్తున్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులను విహారయాత్రలకు తీసుకొని వెళ్తున్నారు.

పేరువెనుక చరిత్ర

మార్చు

కొత్తసత్రం గ్రామనామం కొత్త అనే పూర్వపదం, సత్రము అనే ఉత్తరపదాల కలయికలో ఏర్పడింది. కొత్త అనేది పూర్వాపరసూచిగా, సత్రము అనేది జనపదసూచిగానూ గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. సత్రము అన్న పదానికి విశ్రాంతి గృహం, అన్నప్రదాన గృహమన్న అర్థాలు వస్తున్నాయి.[1]

మూలాలు

మార్చు
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015.