కొత్తూరు ధనదిబ్బలు

కొత్తూరు ధనదిబ్బలు & పాండవుల గుహలు కొత్తూరు గ్రామం సమీపంలో (అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న గ్రామం) ఉన్న బౌద్ధ గుహలు. [1]

Kotturu Dhanadibbalu
Pandavula guhalu
Protected Buddhist Monument
Buddhist Stupa at Kotturu
Buddhist Stupa at Kotturu
Country India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాVisakhapatnam
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationAP
Nearest cityVisakhapatnam
Dhanadibbalu is a Holy relic Buddhist site of Andhra Pradesh

చరిత్ర మార్చు

ఇది పురాతన బౌద్ధక్షేత్రం. ఇక్కడ మహాస్థూపం, బౌద్ధ సన్యాసులు నివసించిన గుహల అవశేషాలు ఉన్నాయి. ఇది శారదానదీ తీరంలో ఉన్న ఈ గుహల ప్రాంతాన్ని క్రీ.పూ. 1 శతాబ్దం నుండి సా.శ. 2వ శతాబ్దం వరకు బైద్ధ సన్యాసుల నివాసప్రాంతంగా ఉండేదని విశ్వసిస్తున్నారు.ఈ ప్రాంతాన్ని ప్రాంతీయంగా " ధనదిబ్బలు అని పిలుస్తుంటారు. [2] ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆర్కియాలజీశాఖ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ విహారాలు, శిలాశాసనాలు బయల్పడుతూ ఉన్నాయి. మహాస్థూపం సమీపంలో చిన్న రాతి పీపాలు ఉన్నాయి. కొండనుండి కొతదూరం పోయిన తరువాత అక్కడక్కడా ఇటుకలు ఊడిపోయిన బౌద్ధవిహారాలు ఉన్నాయి.మరికొంత దూరంలో రాతిని తొలిచిచేసిన 5 గుహలు ఉన్నాయి. ఈ గుహలను పాండవుల గుహలు అని ప్రాంతీయులు చెపుతుంటారు.సరైనరక్షణ, కాపలా లేనికారణాంగా ఇటుకలను ప్రజలు వారి నిర్మాణాలకు వాడుకుంటున్నారు. అవశేషాల చుట్టూ కంచ నిర్మించబడింది. ఆర్కియాలజీశాఖ ఇక్కడ ఒకపూదోటను నిర్వహిస్తున్నారు.

భౌగోళికం మార్చు

కొత్తూరు ధనదిబ్బలు జిల్లా కేంద్రం అయిన అనకాపల్లి నుండి 31 కీమీ దూరం లో ఎలమంచిలి - అత్చుతాపురం రహదారిలో ఉంటుంది.

సమీప బస్ స్టేషన్ - ఎలమంచిలి (8 కి. మీ)

సమీప రైల్వే స్టేషన్ - ఎలమంచిలి (9 కి.మీ)

సమీప విమానాశ్రయం - విశాఖపట్నం (46 కి.మీ)

చిత్రమాలిక మార్చు

మూలాల జాబితా మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-06. Retrieved 2016-10-23.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-21. Retrieved 2016-10-23.