కొత్త రమాకాంత్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989 నుండి 1994 వరకు బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

కొత్త రమాకాంత్‌

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 నుండి 1994
నియోజకవర్గం బోధన్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973
బోధన్, నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం బోధన్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

కొత్త రమాకాంత్‌ 1973లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, బోధన్ పట్టణంలో జన్మించాడు. ఆయన బీకాం వరకు చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

కొత్త రమాకాంత్‌ 1973లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సుదర్శన్‌ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో రమాకాంత్‌కు 36,702 ఓట్లు రాగా, పి.సుదర్శన్‌ రెడ్డికి 33,107 ఓట్లు వచ్చాయి దీనితో ఆయన 3595 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

ఆయనకు 1994 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సుదర్శన్‌ రెడ్డి చేతిలో 9289 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2001లో జరిగిన నిజామాబాదు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఆశించి ఎన్నికల్లో పోటీ చేసి బోధన్‌ జెడ్సీటీసీగా గెలిచాడు కాని టీడీపీకి తగినంత మెజారిటీ రాలేదు. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉధ్యమంలో పట్టణ కుల సంఘాల జేఏసీ ఏర్పాటులొ కీలక పని చేశాడు. ఆయన తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. Eenadu (31 October 2023). "మంత్రి, ఎమ్మెల్యేలుగా పనిచేసి..జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై." Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  2. Sakshi (9 November 2018). "కాంగ్రెస్‌ దూకుడు". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  3. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.