కొత్వాల్‌గూడ ఎకో పార్కు

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ గ్రామంలోని పార్కు

కొత్వాల్‌గూడ ఎకో పార్కు, (ఆంగ్లం: Kothwalguda Eco Park) తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ గ్రామంలో నిర్మించబడుతున్న ఎకో పార్కు. హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో 75 కోట్ల వ్యయంతో 125 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ఎకో పార్కులో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, అక్వేరియం, ఫుడ్‌కోర్టు, రెస్టారెంట్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, లగ్జరీ వుడెన్‌ కాటేజెస్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.[1]

కొత్వాల్‌గూడ ఎకో పార్కు
కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్
రకంఎకో పార్కు
స్థానంకొత్వాల్‌గూడ, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
విస్తీర్ణం125 ఎకరాలు
నవీకరణ2022
నిర్వహిస్తుందిహెచ్‌ఎండీఏ
స్థితినిర్మాణంలో ఉంది

శంకుస్థాపన మార్చు

ఈ పార్కు నిర్మాణ పనులకు 2022 అక్టోబరు 11న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[2] ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేకతలు మార్చు

పార్కులో ఏర్పాటుకానున్న సదుపాయాలు:[3]

  • 2.5 కి.మీ పొడవు, 2.4 మీటర్ల వెడల్పుతో బోర్డు వాక్‌
  • 6 ఎకరాల్లో బర్డ్‌ ఏవియరీ
  • 2.5 కి.మీ పొడవు, 6 మీటర్ల వెడల్పుతో పాత్‌వేలు
  • అప్రోచ్‌ రోడ్డు, ఎంట్రన్స్‌ వద్ద పార్కింగ్‌ సదుపాయం
  • గెజెబోస్‌, పర్‌గూలాస్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, అక్వేరియం, ఫుడ్‌కోర్టు, రెస్టారెంట్స్‌
  • బట్టర్‌ ఫ్లై గార్డెన్‌, సెన్‌సోరి పార్క్‌, గ్రీనరీ ల్యాండ్‌స్కేపింగ్‌, ఇన్ఫినిటీ పూల్‌, క్యాంపింగ్‌ టెంట్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, లగ్జరీ వుడెన్‌ కాటేజెస్‌
  • ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా భూములను కలుపుతూ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

మూలాలు మార్చు

  1. telugu, NT News (2022-10-11). "గండిపేట పార్కును ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
  2. "KTR: దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకోపార్క్‌ ఏర్పాటు చేయబోతున్నాం: మంత్రి కేటీఆర్‌". EENADU. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
  3. "తటాక తీరంలో ఆనంద విహారం". Sakshi. 2022-10-11. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-11.