కల్వకుంట్ల తారక రామారావు
కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు.[1] సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.
కల్వకుంట్ల తారక రామారావు | |||
![]() కల్వకుంట్ల తారక రామారావు | |||
పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 సెప్టెంబర్ 2019- | |||
నియోజకవర్గం | సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1976, జూలై 24 కొదురుపాక, బొయినపల్లి మండలం సిరిసిల్ల జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | శైలిమ | ||
సంతానం | హిమాన్ష్ (కొడుకు), అలేఖ్య (కూతురు) | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ | ||
మతం | హిందూ మతము |
జననం - విద్యాభ్యాసంసవరించు
తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాదులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1990-91 ఎస్‌ఎస్‌సీ, జీజీ స్కూల్, హైదరాబాద్.1991-93 ఇంటర్, విజ్ఞాన్ కాలేజీ, గుంటూరు.గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేసి హైదరాబాద్ వచ్చి మెడిసిన్ ఎంట్రెన్స్ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.[2]
రాజకీయ ప్రస్థానంసవరించు
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసాడు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చురుకైన పాత్ర పోషించాడు. 2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు.[3]
శాసన సభ్యుడిగా, మంత్రిగాసవరించు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు.[4] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖలను కేటాయించారు.[5][6]
మూలాలుసవరించు
- ↑ ఈనాడు, ఆదివారం సంచిక. "నాన్న పేరు నిలబెడతా!". Archived from the original on 19 February 2018. Retrieved 28 February 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (9 September 2019). "మంత్రిగా మరోసారి". Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజావార్తలు (9 September 2019). "ఐటీహబ్ నిర్మాణ సారథి..యువతరానికి ఐకాన్ 'కేటీఆర్'". ntnews.com. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
- ↑ indiatoday, Ashish; HyderabadDecember 17, ey; December 17, ey; Ist, ey (17 December 2018). "KT Rama Rao takes charge as TRS working president". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
- ↑ సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.