రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 2 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవ్సాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గపు ప్రత్యేకతలు.
రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°18′36″N 78°24′0″E |
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చునియోజకవర్గపు గణాంకాలు
మార్చుఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 తొలకంటి ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ 2014 తొలకంటి ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ 2018 తొలకంటి ప్రకాష్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ గణేష్ గుప్త తెలుగుదేశం పార్టీ 2023[2] తొలకంటి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ తోకల శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్ భూపాల్ రెడ్డి పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకాశ్ గౌడ్ పోటి చేస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున సామరాజ్ పాల్ రెడ్డి బరిలో ఉన్నాడు. మజ్లిస్ తరఫున ఇంద్రారెడ్డి కుటుంబానికి ఆత్మీయుడైన మురళీధర్ రెడ్డి పోటీ చేస్తుండగా, జ్క్షానేశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు.[3] లోక్‌సత్తా తరఫున సోల్‌కర్ రెడ్డి బరిలో ఉన్నాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక తేది 22-03-2009