కొమురం భీమ్ గిరిజన సంగ్రహాలయం

(కొమరం భీమ్ ట్రైబల్ మ్యూజియం నుండి దారిమార్పు చెందింది)

కొమురం భీమ్ గిరిజన సంగ్రహాలయం, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో ఉంది. దీనిని జోడేఘాట్ మ్యూజియం, ఆసిఫాబాద్ మ్యూజియం అని కూడా పిలుస్తారు, ఇది ఆసిఫాబాద్, పరిసర ప్రాంతాలలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశాలలో ఒకటి.[1][2]

కొమురం భీమ్ గిరిజన సంగ్రహాలయం
జోడేఘాట్ గిరిజన మ్యూజియం వద్ద కుమురం భీం విగ్రహం
పటం
Established2016
Locationకెరమెరి, కొమరంభీం జిల్లా, తెలంగాణ
Coordinates19°22′04″N 79°09′40″E / 19.36779°N 79.16104°E / 19.36779; 79.16104
Collection sizeగిరిజన కళాఖండాలు
Ownerతెలంగాణ ప్రభుత్వం

ఆసిఫాబాద్ గిరిజన సంస్కృతి, వారసత్వం పరంగా ఈ మ్యూజియం చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తుంది. 1940 సెప్టెంబరు 1న జోడేఘాట్‌లో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్, అతని సహచరులు వీరమరణం పొందారు, ఈ ప్రదేశం శౌర్యం, ధైర్యానికి పేరుగాంచింది.

కొమరం భీమ్, ప్రముఖ గిరిజన విప్లవకారుడు, ఆదివాసీ హక్కుల కోసం పోరాడారు. జల్ (నీరు), జంగిల్ (అడవి), జమీన్ (భూమి) అనే తన ఆలోచనలకు ప్రసిద్ధి చెందారు.

చరిత్ర సవరించు

జల్ (నీరు), జంగిల్ (అడవి), జమీన్ (భూమి) కోసం ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుల గౌరవార్థం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2016 , అక్టోబర్ 16న ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు.[3] కొమరం భీమ్ ఆదివాసీ హక్కులు, అటవీ ప్రాంతాలను రక్షించడానికి నిజాం పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన నాయకుడు. ఇక్కడి ప్రదేశంలో మంచి రక్షణ సౌకర్యాలు ఉన్నందున, భీమ్ జోడేఘాట్‌ను కేంద్ర బిందువుగా ఎంచుకున్నాడు.[4][5]

1940 సెప్టెంబరు 10న భీమ్ తన చివరి సమావేశాన్ని జోడేఘాట్‌లోని అవ్వల్ పెన్ వద్ద నిర్వహించారు. నిజాం మనుషులు అతనిపై దాడి చేశారు. ఈ పోరాటంలో కుమురం భీమ్, అతని అనుచరులు పలువురు హత్య చేయబడ్డారు.

మ్యూజియం ఏర్పాటు సవరించు

గిరిజన యోధుడు కొమరం భీమ్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తించింది.  తరువాత, ఆసిఫాబాద్ ప్రాంతంలో గిరిజన సంప్రదాయాలకు కేంద్రంగా మ్యూజియం నిర్మాణం, అభివృద్ధి కోసం 25 కోట్ల గ్రాంట్ ఆమోదించబడింది.[6]

మ్యూజియంలో ప్రధానంగా గోండులు, కొలాం, తోటీలు, ఆంధ్‌లు, ప్రధానుల నుండి వచ్చిన గిరిజన అవశేషాల సేకరణ వస్తువులు ఉన్నాయి.  మ్యూజియంలో గిరిజనుల ఆచారాలు, సంఘటనలను వర్ణించే శిల్పాలు కూడా ఉన్నాయి.  ఈ మ్యూజియం గిరిజన సంస్కృతిని సూచించే కేంద్రంగా ఉంది. ఇందులో గిరిజన దేవుళ్ల విగ్రహాలు కూడా ఉన్నాయి.[7][8]

చిత్రాలు సవరించు

మూలాలు సవరించు

  1. https://www.telangana360.com/2016/12/jodeghat.html
  2. https://telanganatoday.com/jodeghat-village-on-development-path-in-asifabad
  3. Today, Telangana (2021-10-20). "Thousands pay homage to tribal legend Kumram Bheem". Telangana Today. Retrieved 2022-06-20.
  4. Komaram Bheem Museum In Jodeghat Village || Adilabad | hmtv Telugu News (in ఇంగ్లీష్), retrieved 2022-06-20
  5. Jodeghat | Komaram Bheem's Birth Village | Loosing It's Charm Due to Lack of Basic Amenities (in ఇంగ్లీష్), retrieved 2022-06-20
  6. "Jodeghat Museum: జోడెన్‌ఘాట్‌ వీరభూమి". Sakshi. 2021-03-29. Retrieved 2022-06-20.
  7. https://www.deccanchronicle.com/141010/nation-current-affairs/article/rs-25-crore-granted-jodeghat
  8. https://www.thehindu.com/news/national/telangana/jodeghat-museum-closed-for-over-a-month/article30895661.ece