ప్రధాన మెనూను తెరువు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు

రాజకీయ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి

కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) భారతదేశంలోని నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి[1]. ఈయన కె.సి.ఆర్ గా సుపరిచితులు.[2][3][4] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.[5]

కల్వకుంట్ల చంద్రశేఖరరావు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖర రావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014-06-02
నియోజకవర్గము గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-02-17) 1954 ఫిబ్రవరి 17 (వయస్సు: 64  సంవత్సరాలు)
చింతమడక, మెదక్, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి శోభ
సంతానము కల్వకుంట్ల తారక రామారావు (కొడుకు) మరియు కల్వకుంట్ల కవిత (కూతురు)
నివాసము హైదరాబాదు
మతం హిందూమతము
http://www.archive.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4083

ఇతడు మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు.

విషయ సూచిక

జీవిత విశేషాలుసవరించు

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు[6]. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం.ఎ (తెలుగు సాహిత్యం) పూర్తి చేశారు[7]. ఆయన ఏప్రిల్ 23 1969 న శ్రీమతి శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె. కల్వకుంట్ల కవితలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.కుమారుడు కె.తారకరామారావు శాసన సభ్యులుగానూ, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు.

రాజకీయ జీవితంసవరించు

 
హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం

విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె.చంద్ర శేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[8]. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉపఎన్నిక) లో వరుసగా ఎన్నిక అయ్యారు 1997-98లో తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా రవాణా మంత్రి పదవి లభించింది. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు.

ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి[9] 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు[9][10]. 2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు.[11]. 14వ లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్‌సభ సభ్యులు ఉన్న టి.ఆర్.ఎస్. తరఫున ఆలె నరేంద్రతో పాటు కె.చంద్ర శేఖరరావు మంత్రిపదవులు పొందినారు[12] . 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యు.పి.ఏ. కూటమికి మద్దతు కూడా ఉపసంహరించబడింది[13]. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000 పైగా మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందినాడు.

ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పండితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ "ఆరు" అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు.[14][15][16]

తెలంగాణ ఉద్యమంసవరించు

2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు.[9][17] 2009, నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. దీనిని దీక్షా దివస్ గా పేర్కొన్నారు....

పథకాలు - ఆవిష్కరణలుసవరించు

కాలరేఖసవరించు

 • 1985-2004 :ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (4 సార్లు)
 • 1987-88 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సహాయ మంత్రి
 • 1992-93 : అధ్యక్షుడు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్
 • 1997-99 : ఆంధ్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
 • 1999-2001 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతి
 • 2001 ఏప్రల్ 21 :తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా
 • 2001 ఏప్రల్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన
 • 2004 : 14 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
 • 2004-06 : కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి
 • సెప్టెంబరు 23, 2006 : లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
 • డిసెంబరు 7, 2006 : 14 వ లోక్ సభ ఉప ఎన్నికలో మరల ఎన్నిక
 • మార్చి 3, 2008 : లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
 • 2009 : 15 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక (2వ సారి)
 • లోకసభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు
 • ఆగస్టు 31, 2009 : కమిటీ ఆన్ ఎనర్జీలో సభ్యులు
 • సెప్టెంబరు 23, 2009 : రూల్స్ కమిటీలో సభ్యులు
 • 2014 : 16 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
 • 2014 : తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యునిగా ఎన్నిక
 • 2014 : తెలంగాణ రాష్ట్రం శాసన సభా పక్ష నాయకునిగా ఎన్నిక.
 • 2014, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

మూలాలుసవరించు

 1. "Telangana CM, K Chandrashekar Rao, a Hindi, but not English speaking CM in south India". timesofindia.indiatimes.com. Retrieved 2014-08-03. 
 2. KCR the strong leader in Telangana state
 3. Telangana Jathi Pitha KCR
 4. "'Make in Telangana' should be a global standard: KCR". thehindu.com. The Hindu. 
 5. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
 6. "Who is KCR?". NDTV.com. Retrieved 2014-08-03. 
 7. "Fifteenth Lok Sabha Members Bioprofile". Parliament of India. Archived from the original on 31 March 2014. Retrieved 7 January 2016. 
 8. "KCR to enter Congress via Telangana?". IBN Live. 26 February 2014. Retrieved 26 February 2014. 
 9. 9.0 9.1 9.2 "Dy. Speaker resigns, launches new outfit". hindu.com. The Hindu. 28 April 2001. Retrieved 2014-02-24. 
 10. "Telangana finds a new man and moment". Hinduonnet.com. 19 May 2001. Retrieved 2011-06-30. 
 11. http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083
 12. "Politics of separation". Frontline. Retrieved 24 February 2014. 
 13. "Telangana isn't scary". hindustantimes.com. Hindustan Times. 10 December 2009. Retrieved 2011-06-30. 
 14. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Retrieved 27 May 2014. 
 15. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Retrieved 2 June 2014. 
 16. "Politics of separation". Frontline. Retrieved 16 April 2014. 
 17. "Telangana finds a new man and moment". Hinduonnet.com. 19 May 2001. Retrieved 29 November 2017. 

ఇతర లింకులుసవరించు

వంశవృక్ష ఆధారంసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.